calender_icon.png 16 November, 2024 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలను అప్పుల పాల్జేసింది

11-11-2024 01:06:13 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలను అప్పుల పాల్జేసిందని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలకు మళ్లీ ఉరితాడునిచ్చిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలతో నేతన్నలకు కేసీఆర్ ఉపాధి కల్పించారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్.. నేతన్న కడుపు కొడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజకీయానికి అనాథలైన బిడ్డలకు తల్లిదండ్రుల రక్ష ఏది? అని కేటీఆర్ ప్రశ్నించారు. తల్లిదండ్రుల చెంత అల్లారుముద్దుగా పెరగాల్సిన ఈ బిడ్డలను అనాధలు చేసిన పాపం ఊరికే పోదు.. ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ మా గోరటి వెంకన్న పాడిన సాలెల మగ్గం సడుగులిరిగినయ్ అనే పాట కాంగ్రెస్ పాలనలో మళ్లీ యాదికొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.