calender_icon.png 8 November, 2024 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం తీర్పులపై విమర్శలు సరికాదు

08-08-2024 12:09:44 AM

  1. న్యాయమూర్తులు సంయమనం పాటించాలి
  2. సీజేఐ డీవై చంద్రచూడ్

న్యూ ఢిల్లీ, ఆగస్టు 7: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయమూర్తులు బహిరంగ విమర్శలు చేయడం సరికాదని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. సుప్రీం దేశాలను పాటించడం ఐచ్ఛికం కాదని.. తప్పనిసరి అని అన్నారు. పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తి తీరును సుప్రీం తప్పుపట్టింది. సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వలన  ఓ వర్గం అసంతృప్తికి గురికావచ్చు. కానీ ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై న్యాయమూర్తులు బహిరంగంగా కామెంట్, విమర్శలు చేయడం సరికాదు. ఈ విమర్శలు న్యాయస్థానాల గౌరవాన్ని తగ్గిస్తాయిని అన్నారు. 

అసలు వివాదం ఏంటి..?

ఓ భూ వివాదం కేసుకు సంబంధించి కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై మే 3న సుప్రీం కోర్టు స్టే విధించింది. దీనిపై పంజాబ్ హైకోర్టు న్యామూర్తి జస్టిస్ రాజ్‌బిర్ షెరావత్ బహిరంగ విమర్శలు చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ పరిణామాన్ని తీవ్రంగా అభివర్ణించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ రాజ్‌బిర్ వ్యాఖ్యలు ధిక్కార కేసు కిందకే వస్తాయని పేర్కొన్నారు. అయితే రాజ్‌బిర్‌పై చర్యలు తీసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.