22-03-2025 05:26:00 PM
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసి మంత్రి సీతక్కను సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కించపరిచేలా వ్యవహరించాలని ఆదివాసి సమాజం దాన్ని సహించదని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివాసి సంఘం నాయకులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో అనుభవస్తురాలని అటువంటి వ్యక్తిని కించపరచడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివాసి సమాజం మొత్తం రవి శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు.
అగ్రవర్ణాల అహంకారంతో శ్రీనివాస్ వ్యవహరించడం సరైనది కాదన్నారు. మంత్రికి బేషరతుగాగా క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆదివాసి సమాజం మొత్తం మంత్రికి అండగా ఉంటుందని అన్నారు.రావి శ్రీనివాస్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆదివాసి సంఘాల నాయకులు మూకుమ్మడిగా రావి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ గణపతి, జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, జిల్లా నాయకులు శ్యామ్, చరణ్, వసంతరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రావి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్...
సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ మంత్రిపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన రావి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జి పై పూర్తిస్థాయి క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.