calender_icon.png 26 October, 2024 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనా లోపంతో కేటీఆర్‌పై విమర్శలు

12-08-2024 01:14:43 AM

బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ నేత రావుల ధ్వజం

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, కేటీఆర్‌ను జైల్లో వేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పడం ఏమిటని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లా డుతూ.. కేటీఆర్ ఏ తప్పు చేశారని జైల్లో పెడతారని అడిగారు. రాష్ర్టంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యాయరని ఆరోపిం చారు.

బండి సంజ య్ ఎంపీగా ఉండీ మసీదులు తవ్వుతానని అన్నారని, ఇప్పుడు జైశ్రీరా మ్ పేరుతో కేంద్ర మంత్రి అయ్యారని విమర్శించారు. పదేళ్లు రాష్ర్ట మంత్రిగా కేటీఆర్ ఏంచేశారో చెప్పడానికి తాము సిద్ధమని.. చర్చకు బండి సంజయ్ సిద్ధ మా? అని సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహా య మంత్రి అర్హతలేమిటో కూడా తెలియవన్నారు. పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించవద్దని బండి సంజయ్ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఆయన కేంద్ర మంత్రినా.. కాంగ్రెస్ అధికార ప్రతినిదా? ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ తప్ప వేరే పేర్లు రావని.. బీఆర్‌ఎస్ కాలం చెల్లిన పార్టీ అయితే ఎమ్మెల్యేగా బండి సంజయ్ ఎవరి చేతిలో ఓడిపోయారో గుర్తు తెచ్చుకోవాలని చురకలంటించారు.  కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్ చేతిలోనే ఓడిపోయారని, బండి సంజయ్‌కు దమ్ముంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 10 శాతం మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఒక్క జెడ్పిటీసీని గెలిపించి సత్తా చూపించాలని అన్నారు. కేటీఆర్‌పై ఉన్న ఈర్ష్యతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారని, బండి సంజయ్‌ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో చేర్చాలని అన్నారు.