calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలి

28-10-2024 02:31:45 AM

కడియం శ్రీహరికి రాజయ్య హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి):  కేసీఆర్, కేటీఆర్‌లపై మాజీ మంత్రి కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవా లని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు. కడియం శుద్ధపూసలా మాట్లాడుతున్నారని, రాజకీయ వ్యభిచారిలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీ పెట్టారని, కడియం శ్రీహరి ముందు బెంచి నుండి వెనుక బెంచిలో కూర్చునే స్థాయికి వచ్చారని, ఫిరాయింపు చట్టాలపై గౌరవం ఉందని మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. 1994లో కడియం ఎమ్మెల్యే అయ్యేనాటికి పాత స్కూటర్ ఉండేదని, ఎన్టీఆర్ పిలిచి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేశారని తెలిపారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తో జత కట్టారని, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా చేసి కుబేరుడు అ య్యారని ఆరోపించారు. శ్రీహరి కు మార్తె ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ హాంకాంగ్, సింగపూర్‌లో ఆస్తులు కొనుగోలు  చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు నమ్మకద్రోహం చేశారని, బ్లాక్‌మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారని, పార్టీ ఫండ్ ఇచ్చాక కాంగ్రెస్ పారీలోక్టి మారారని విమర్శించారు.

కడియం అభివృద్ధి నిరోధకుడు, స్టేషన్ ఘన్ పూర్‌కు టెక్స్ టైల్ పార్క్, డిగ్రీ కళాశాల రా కుండా చేసిన ద్రోహి అని విరుచుకపడ్డారు. రాష్ట్రంలో  పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డికి కడియం వంత పాడుతున్నారని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు  నెలల్లో కూలిపోతుందని కడియం అన్నమాటలను కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టుకో వాలని సూచించారు. స్థాయిని మరిచి కేసీఆర్‌ను శ్రీహరి విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.