పార్టీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ కన్వీనర్ గిరీశ్ దారమోని సస్పెండ్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): పార్టీ నియమ నిబంధ నలను ఉల్లంఘించి, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా సెల్ జాయిం ట్ కన్వీనర్ గిరీశ్ దారమోనిని ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశా మని రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీలో ఉన్న ముఖ్యమైన నలుగురు నేతలపై సోషల్ మీడియా వేదికగా గిరీశ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో పరిస్థితి దారుణంగా ఉందని, ఆ నలుగురి వల్ల పార్టీ నాశనం అవుతోం దని, వారు తప్ప ఎవరూ పార్టీలో ఎదగవద్దన్నట్టు వారి వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీలో నాయకులు, కార్యకర్తలు మనుగడ సాధించాలంటే ఆ నలుగురు నేతల మోచేతి నీళ్లు తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
రాష్ట్రంలో పార్టీ బాగు పడటం ఇష్టం లేదన్నట్టు వారి వ్యవహారం ఉందని కూడా గిరీశ్ సోషల్ మీడియా వేదికగా పలు వీడియోల ద్వారా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు.