calender_icon.png 19 April, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి.. ప్రభుత్వం.. ఏఐ

10-04-2025 12:00:00 AM

హెచ్‌సీయూ భూముల ఉద్యమంలో ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు 

సుప్రీంకోర్టు జోక్యంతో నిలిచిపోయిన భూమి చదును పనులు

ఏఐని వినియోగించి ప్రభుత్వాన్ని బద్నాం చేశారని ఆరోపణలు 

ఫేక్ పోస్టులు, వీడియోలు సృష్టించిన, వినియోగించిన వారిపై నజర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): నిజం గడప దాటే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనేది నా నుడి.. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిన హైదరాబాద్ సెంట్రల్  యూ నివర్సిటీ(హెచ్‌సీయూ) కంచె గచ్చిబౌలి భూముల విషయంలో నిజమనే అనిపిస్తోం ది. హెచ్‌సీయూకు చెందిన 400ఎకరాల భూములను టీజీఐసీసీసీకి ప్రభుత్వం అప్పగిస్తుందని తెలిసి యూనివర్సిటీలోపల, బ యట ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పదుల సంఖ్యలో జేసీబీలను పెట్టి ఆ 400ఎకరాల భూములను చదును చేసే ప్రక్రియను ప్రా రంభించి, దాదాపు 100ఎకరాలను చదును చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబ డుతూ హెచ్‌సీయూ క్యాంపస్‌లో విద్యార్థులు, టీచింగ్, నాన్‌టీచింగ్, ఇతర సిబ్బంది ఆందోళనలు చేశారు. నగరంలో పలువురు పర్యావరణ ప్రేమికులు, ఉద్యమకారులు, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, బీఆర్‌ఎస్‌వీ, తదితర విద్యార్థి సంఘా లు, బీజేపీ, సీపీఎం పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఆ 400ఎకరాల భూమి తమదేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ భూముల్లో దట్టంగా ఉన్న చెట్లను చదును చేయడంతో అక్కడ ఉన్న జింకలు, నెమళ్లు, ఇతర  జీవజాలం ఇబ్బందులకు గురవుతుందని, వాటిని కాపాడాలని ఆందోళనకారులు సోషల్‌మీడియాలో పెట్టిన ఫొటోలు, వీడియోలు, పోస్టులు వైరల్ అయ్యాయి. వాటి లో సహజమైన ఫొటోలు, వీడియోలతో పా టు వివిధ సాంకేతికతతో రూపొందించినవి కూడా ఉన్నాయి. కాగా మార్చి 13న ప్రారంభమై, మార్చి 30న మరింత ముదిరిన హెచ్ సీయూ విద్యార్థుల ఉద్యమానికి సుప్రీంకో ర్టు జోక్యంతో కాస్త విరామం లభించింది. 

సోషల్ మీడియా పోస్టులతో ముదిరిన వివాదం

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని పలువురు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వివాదం మరింత ముదిరింది. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారమైన ఆ పోస్టుల్లో జేసీబీలు చెట్లను తొలగిస్తుంటే దిక్కుతోచక జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు ఉన్న ఫొటోలు, నెమళ్లు, జంతువులు వాటి ఆర్తనాదాలు వినిపిస్తున్న ట్లు ఆడియో, వీడియోలు ఉన్నాయి. వీటి పై స్పందించిన పలువురు రాజకీయ నాయకు లు, విద్యార్థి సంఘాలు, సెలబ్రిటీలు, ప్రముఖులు వాటిని షేర్‌చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. 

ఏఐ వినియోగంపై అదుపు లేకుంటే..

రోజు రోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను మంచి పనులకు వినియోగిస్తే సరే.. కానీ అసత్యాల వ్యాప్తికి వినియోగిస్తే ఎ లా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల వివాదంలో ఉపయోగించిన ఏఐ ఫొటోలు, వీడియోలతో పర్యావరణ విధ్వంసాన్ని తెలియజేసిన ప్పటికీ అందులో వాస్తవాలేంటి అనేది ప్ర భుత్వం వివరణ ఇచ్చే లోపే బాహ్యప్రపంచంలో అవి ప్రభావాన్ని చూపాయి. కాగా ఏ ఐ వినియోగంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని తెలుస్తోంది. 

సీఎం ఆగ్రహం.. బీఆర్‌ఎస్ నేతలపై కేసులు

హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో కావాలనే ఏఐ ఫొటోలు, వీడియోలు సృష్టిం చి వాటిని ప్రచారం చేసి బద్నాం చేశారని ప్రభుత్వం చెపుతోంది. ఇటీవల ప్రభుత్వ ము ఖ్య అధికారులతో జరిగిన సమావేశంలో స్వ యంగా సీఎం రేవంత్‌రెడ్డి నకిలీ ఫొటోలు, వీడియోలపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. నకిలీ ఫొటోలు, వీడియోల అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో వాటిని రూపొందించిన వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. దీంతో ఏఐ ఫొటోలు, వీడియలో సృష్టించారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిశాంక్, దిలీప్‌లపై కేసు నమోదు చేసిన పో లీసులు, నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఏఐ ఫొటోలు, వీడియోలను పోస్టు చేసిన పలువురిని గుర్తించి వారిపై కేసులు నమో దు చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలువురు రూ పొందించిన ఈ ఫొటోలు, వీడియోలు నిజమైనవా, నకిలీవా అని ప్రభుత్వం, అధికార పార్టీ, దానికి సంబంధించిన విభాగాలు కూ డా స్పందించకపోవడం గమనార్హం.