calender_icon.png 30 October, 2024 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్

12-07-2024 01:09:56 AM

తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ -ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క స్పష్టంచేశారు. సచివాలయంలో క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి భట్టితో స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్లు మూర్తి, నరసింహ, అశోక్ కామరాజ్, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిశెట్టి మోహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా భట్టి దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. అందులో ప్రధానంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పాదనలో దేశం బాగా వెనుకబడి ఉందని, వీటి ఉత్పాదన కోసం స్ట్రాటజిక్ అప్లికేషన్ మినరల్స్ అండ్ మెటల్స్‌ను ఏర్పాటు చేస్తే అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. బ్యాటరీల్లో ఉపయోగించే లిథియం, సెమీకండక్టర్ల తయారీకి వినియోగించే గాలియం, పర్మినెంట్ బ్యాటరీల్లో వాడే రేర్ ఎర్త్ మెటల్స్‌ను సొంతంగా తయారుచేసుకుంటే దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అంతేకాకుండా సాంకేతికంగా దేశం మరింత పురోభి వృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. క్రిటికల్ మినరల్స్‌ను చైనా నుంచి వంద శాతం దిగుమతి చేసుకుంటున్నామని, ఈ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడుతుందన్నారు. నిపుణుల సూచనలకు సానుకూ లంగా స్పందించిన డిప్యూటీ సీఎం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.