calender_icon.png 20 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిటికల్ కేర్ పనులు పూర్తి చేయాలి

17-04-2025 12:13:53 AM

  1. శానిటేషన్ సిబ్బందికి సరైన వేతనం అందించాలి 

ఎంసిహెచ్ ఆసుపత్రిని సందర్శించిన ప్రణాళికా సంఘం 

ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి 

వనపర్తి టౌన్ ఏప్రిల్ 16: క్రిటికల్ కేర్ ఆస్పత్రి పనులను త్వరిత ఘతన పూర్తి చేసి పేషెంట్లకు అందించాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం పట్టణం లోని (ఎం సి హెచ్) మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆస్పత్రిని చిన్నారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ జిల్లాలో వనపర్తి లో ఉన్న ఎంసీ హెచ్ ఇలాంటి ఆసుపత్రి మరెక్కడ లేదని అన్నారు.

చుట్టుపక్కల కొల్లాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా నలుమూల గ్రామాల ప్రజలు వనపర్తి ఆసుపత్రిని ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి వైద్యం చాలా బాగుందని ప్రసవానికి వచ్చిన ప్రతి రోగి కూడా సంతృప్తి చెంది వెళ్తుంటాడని తెలిపారు. వైద్యంతోపాటు ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కూడా రోగులను మంచిగా చూసుకుంటున్నారని తెలిపారు.

శానిటేషన్ సిబ్బందిని ఎంత గౌరవించినా తక్కువేనని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది లేకుంటే ఆసుపత్రి లోని గదులు అపరిశుభ్రంగా మారి కంపు కొడుతుంటాయని తెలిపారు. డాక్టర్ల వైద్యంతో పాటు శానిటేషన్ సిబ్బంది సేవలు చాలా ముఖ్యమని తెలిపారు. కొంతమంది శానిటేషన్ సిబ్బందితో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడారు. మీ అందరికీ ప్రతినెల ఎంత జీతం వస్తుందని అడిగి తెలుసుకున్నారు.

ప్రతినెల 15,996 రూపాయలు నీకు రావాల్సి ఉంటుందన్నారు. కానీ మీ యాజమాన్యం 11,500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కార్మికులకు రావాల్సిన వేతనం సక్రమంగా వచ్చేలా చేస్తానని అన్నారు. అంతకుముందు ఆపరేషన్ థియేటర్ రూమ్ ను సందర్శించారు. అక్కడి నుండి ప్రసవించిన తల్లి బిడ్డలను వార్డులలోకి వెళ్లి పలకరించారు.

ఇక్కడి డాక్టర్లు మంచి వైద్యం అందిస్తున్నారా లేదా అని పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్రిటికల్ కేర్, టీ హబ్ లను సందర్శించారు. వెంటనే క్రిటికల్ కేర్ పన్నులను పూర్తి చేసి రోగులకు అందించాలని డాక్టర్ చిన్నారెడ్డి అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్ బంగారయ్య, హెచ్ ఓ డి లు డాక్టర్ దైవ కృప, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ సరళ, నర్సింగ్ ఇంచార్జ్ మల్లేష్, నర్సులు, శానిటేషన్ సూపర్వైజర్లు వెంకటేష్, అశోక్ సిబ్బంది ఉన్నారు.