calender_icon.png 22 January, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 4కోట్ల్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

22-01-2025 01:59:00 AM

ముగ్గురు నిందితుల పట్టివేత.. రిమాండ్ సైబర్ క్రైం  డిఎస్పీ ఎన్ బి రత్నం

వనపర్తి టౌన్, జనవరి 21 : ఏ కష్టం లేకుండా సులువైన పద్ధతిలో డబ్బు సంపాదన దురాశతో ఆన్లైన్ పద్ధతిలో ధని లోన్ ఆప్ ద్వారా అమాయకులను నిలువు దోపిడీకి గురిచేశారు. లోన్ మంజూరి అయ్యిందని లేదా లోన్ కావాలంటే ఇస్తామని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అమాయకుల నుండి 4కోట్ల మేరా వసూలు చేసి మోసగించారు.

మంగళవారం రోజు వనపర్తి పట్టణంలోని  సీఐ కార్యాలయంలో వనపర్తి సైబర్ క్రైం  డిఎస్పీ ఎన్ బి రత్నం,  వనపర్తి సీఐ, క్రిష్ణ తెలిపిన  ప్రకారంగా గోపాల్ పేట మండలం  పొలికేపాడు గ్రామానికి చెందిన కావలి శివుడు, మండ్ల వెంకటేష్ లకు ధని లోన్ సర్వీసెస్లో లోన్ పొందేందుకు అర్హత సాధించినారని మీకు లోన్ అవసరం ఉందా అని అడిగి అన్ని వివరాలు తీసుకుని లోన్ మంజూరు అయినదని లోన్ డబ్బులు మీ అకౌంట్ లోకి జమ కావాలంటే మీరు ఇన్సూరెన్స్, జీఎస్టీ, టీడీఎస్ మరియు ప్రాసెస్సింగ్ చార్జీలు ముందుగానే కట్టవలసి ఉంటుందని సైబర్ నేరగాళ్ళు చెప్పడం జరిగింది.

వాళ్ల మాటలు నమ్మి మూడు విడతల్లో 32,135 జమ చేసిన ఇంకా డబ్బులు కావాలని అడగంతో పిర్యాదు దారులకు అనుమానం వచ్చి గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగిందని వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చెప్పట్టి సోమవారం మూసాపేట్ మండలంకు చెందిన ముదావత్ నరేష్  ,ముడావత్ వెంకటేష్ నాయక్, ముదావత్ చందు నాయక్ లను పట్టుకుని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగిందన్నారు.

వారి నుండి రూ 30 లక్షల విలువ గల కారు, జీసిబి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలిస్తున్నామని మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.