- 9 రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డ నేరగాళ్లు
- బ్యాంక్ మేనేజర్‌తో సహా 52 మంది అరెస్ట్
- వివరాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): సైబర్ మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్న 52 మంది సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బిహార్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో అమాయకులకు అదనపు సంపాదన ఆశచూపి కోట్లు కొల్లగొట్టారు.
ము ప్రధాన నిందితులతో పాటు 52 మం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులు 33 ప్రధాన కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 43 మొబైల్ ఫోన్లు, 39 ఏటీఎం కార్డులు, 17 పాస్‌బుక్‌లు, 54 చెక్ బుక్కులు, 16 సిమ్ కార్డులు, 3 ల్యాప్‌టాప్‌లు, 9 పాన్ కార్డులు, 3 క్యూఆర్ కోడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేరగాళ్లు మొత్తం రూ.88.32 కోట్ల మోసాలకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. వీరి నుంచి రూ. లక్షల నగదుతో పాటు మరో రూ. లక్షలు క్రిప్టో కరెన్సీని పోలీసులు స్వా చేసుకున్నారు. దేశవ్యా 576 కేసులలో, తెలంగాణలో 74 కేసులతో సం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇవి కాకుండా, మరో రూ.2.87 కోట్లను బ్యాంకులలో ఫ్రీజ్ చేశారు.
వీరిలో ట్రేడింగ్ పేరుతో రూ.2.98 కోట్లకు మోసాలకు పాల్పడిన కేసులో బెంగుళూరు ఆర్బీఎల్ డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ జా, యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్ ఇమాముద్దీన్ ధారవాడ్, కోటాక్ బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాట శ్రీనివాసరావులను అరెస్టు చేశారు. కాగా మరోకేసులో డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ నుంచి నేరగాళ్లు రూ.3 కోట్లు కొల్లగొట్టారు.
గతేడాది 354 కేసులు..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ గతేడాది 354 కేసులను చేధించినట్టు తెలిపారు. ఈ కేసుల ద్వారా మొత్తం 300 మందిని అరెస్టు చేయగా, అందులో 294 మంది పురుషులు, 6 మహిళలు ఉన్నారన్నారు. ఈ కేసుల ద్వారా రూ. 41.34 కోట్లను బాధితులకు తిరిగి అందజేశామని, రూ. 41.22 కోట్లను ఎన్సీఆర్పీ ద్వారా ఫ్రీజ్ చేశామని, రూ. 80.16 కోట్లు విచారణ అధికారులు నిలిపివేసినట్టు తెలిపారు.
ఫేస్బుక్, వాట్సాప్, ఇతరత్ర ఆన్లైన్లో మోసాలకు పాల్పడే వారి మాటలను నమ్మొద్దని సీపీ హితవు పలికారు. అనుమానం ఉంటే 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఈ కేసుల దర్యాప్తులో పాల్గొన్న అధికారులను సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. సమావేశంలో డీసీపీ దార కవిత, ఏసీపీ శివ మారుతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అవగాహన
పెరుగుతున్న ఆర్థిక నేరాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు పిరమిల్ సంస్థతో కలిసి హైదరాబాద్ నగర పోలీసులు 15 రోజుల పాటు అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బుధవారం సైబర్ సెక్యూరిటీ అవగాహనా కార్యక్ర ప్రారంభించారు.
చార్మినార్ జంక్షన్, కేబీఆర్ పార్క్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మైత్రీవనం, అమీర్‌పేట తదితర ప్రాంతాలలో 15 రోజుల పాటు వీధి నాటికలు, వీడియోల ద్వారా, సోషల్ మీడియా, బ్యానర్లు, పోస్టర్లు తదితర పద్ధతుల్లో ప్రచారం జరుగుతుందన్నారు. ప్రజలు ఆన్లైన్లో లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.