calender_icon.png 27 November, 2024 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్

24-11-2024 12:15:11 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): అమృత్-2 టెండర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌పై శని వారం నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనకెలాంటి సంబంధం లేకున్నా.. ఆ సంస్థతో లింక్‌లు ఉన్నట్టు కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్ సూదిని సృజన్ రెడ్డి పేర్కొన్నారు.

అమృత్-2 టెండర్ల కేటాయింపు పారదర్శకంగానే జరిగినా నిరాధారమైన ఆరోపణలు చేయడం తో ముందు గా ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చామని అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోనందున క్రిమినల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు సృజన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు ఆయన బావమరిది సృజన్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి తెల్సిం దే.

అమృత్ పథకంలో భాగంగా రూ. 8,888 కోట్ల విలువైన టెండర్‌ను అర్హత లేకున్నా రూ.1,137 కోట్ల పను లను సృజన్‌రెడ్డికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆరోపణలపై సృజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్రమినల్ పిటిషన్ దాఖలు చేశారు.