calender_icon.png 21 January, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల వద్ద ఆందోళన చేస్తే క్రిమినల్ కేసులు

07-12-2024 02:30:04 AM

* ఈ నెల మూడో వారం నుంచి గురుకులాల్లో అడ్మిషన్లు

* ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణీ

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): గురుకుల పాఠశాలల వద్ద ఆందోళనలు చేసే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి హెచ్చరించారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అధికారులను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్ ఎస్సీ గురుకులాల కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. సలహాలు ఇస్తే తీసుకుంటామని, విమర్శలు మాత్రం చేయవద్దని సూచించా రు. సమస్యలుంటే సీఎస్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గురుకులాల్లో అమ్మాయిలు ఉన్న చోట అల్లర్లు చేయవచ్చా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆరోపణలతో గురుకులాల్లో పనిచేయడానికి సి బ్బంది భయపడుతున్నారన్నారు.

విద్యార్థిని చనిపోతే తమకు మాత్రం బాధ ఉండదా అని ప్రశ్నించారు. గురుకులాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. తల్లిదండ్రు లు పంపించే పచ్చళ్లతోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. డిసెంబర్ మూడో వారం నుంచి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటామని.. 45 రో జుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంద న్నారు. ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచైనా లే దా జోనల్ ఆఫీస్‌లకు వెళ్లి కూడా అడ్మిష న్లు తీసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆదాయంకుల ధృవీకరణ పత్రాలు ఉంటే సరిపోతుందని, 20 24 జనవరి 1 నుంచి తీసుకున్న ఆదాయ పత్రాలు చెల్లుతాయని సూచించారు.