calender_icon.png 7 January, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు..!

05-01-2025 01:31:49 PM

పత్రాలు లేకుండానే పట్టా మార్పిడిపై కోర్టు ఆగ్రహం

క్రిమినల్ చర్యలకు ఆదేశం

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే ఒకరి పేరు మీద ఉన్న పట్టా భూమిని మరొకరి పేరున భూ బదలాయింపుకు కారణమైన ఇద్దరు తాహసీల్దారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు అమ్రాబాద్ ఎస్ఐ రజిని(Amrabad SI Rajini) తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన మాలే శంకరయ్యపై అమ్రాబాద్ శివారులోని సర్వే నెంబర్ 900లో 1.10 గుంటల పట్టా భూమి వారసత్వంగా సంక్రమించగా ప్రజా అవసరాల కోసం ఎకరం భూమిని ప్రభుత్వ బస్టాండ్ కోసం దానంగా ఇచ్చారు.

మిగిలిన 10 గుంటల భూమిలో ఐదు గంటల భూమిని ఎలాంటి విక్రయాలు జరుపకపోయినా ఎలాంటి పత్రాలు లేకుండానే డబ్బులకు కక్కుర్తి పడి తాహసీల్దార్లుగా పనిచేసిన పాల్, జె.కృష్ణయ్యలు పల్కపల్లి గ్రామానికి చెందిన అలీ అనే వ్యక్తికి ఐదు గంటల భూమిని బదిలాయించారు.  ఈ విషయంపై బాధితుడు ఆర్డీవో,  కలెక్టర్ వంటి కార్యాలయాలకు తరచూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించగా సాక్షాదారాలను పరిశీలించిన కోర్టు ఇద్దరు తాసిల్దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కోర్టు ఉత్తర్వుల మేరకు అమ్రాబాద్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.