calender_icon.png 3 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరుకొండపేటలో నేరాలు

02-04-2025 01:04:59 AM

  • చట్టాలపై అవగాహనతో తరచూ అఘాయిత్యాలు?

మైనర్లను కూడా వదలని వైనం

ఊరుకొండ ఘటనలో వెలుగులోకి మరిన్ని ఘటనలు

ఘటనా స్థలిని పరిశీలించిన జోన్‌l ఐజీపీ సత్యనారాయణ

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 1 (విజయక్రాం తి): నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట అంజన్న పరిసర ప్రాంతాల్లో నేరాలు ఘోరాలు నిత్య కృత్యంగా జరుగుతున్నాయని పోలీసుల విచారణలో బట్టబయలవు  తోంది.

చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగిన రేపిస్టు ముఠా ఫోక్సో కేసులు అత్యంత కఠినంగా అమలవుతున్నాయని గుర్తించి మైనర్ బాలికల వద్ద కేవలం డబ్బులు మాత్రమే వసూలు చేసి పంపుతున్నారని కానీ మేజర్లు వివాహిత మహిళలు, ఒంటరిగా తిరిగే జంటలే వారి టార్గెట్‌గా ఫోటోలు తీసి భయభ్రాంతులకు గురి చేస్తూ పరువు ప్రతిష్టలకు భయపడే మహిళల పట్ల ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాస్తవా లు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రస్తుతం ఊరుకొండ పేట వద్ద జరిగిన ఈ ఘటనలో కూడా బాధిత వివాహితను సామూహిక అత్యాచారానికి పాల్పడి స్పృహ తప్పి దాహం వేస్తుందని వేడుకున్నా కనికరించకుండా వివహిత నోట్లో మూత్ర విసర్జన చేసినట్లు విచారణలో బయటపడింది. ఫోటోలు తీసి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడం తో కేవలం డబ్బు నగలు దోచుకెళ్లినట్లు మాత్రమే ఫిర్యాదు చేయడం గమనార్హం.

జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆలయ పరిసరాల్లోని సిసి పుట్టేజీ ఆధారంగా కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని ఐజి సత్యనారాయణ తెలిపారు. మంగ ళవారం జిల్లా ఎస్పీ గైక్ పాడు వైభవ్ రఘునాథ్ తో కలిసి ఐజి సత్యనారాయణ కోరుకొండ పేట లోని గుట్ట ప్రాంతంలో జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ప్రతి మంగళ శనివారాల్లో ఊరుకొండ పేట అంజన్న స్వామి ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు  రాత్రులు భక్తితో భజనలు చేస్తూ జాగారం చేస్తుంటారు. ఇక్కడే భక్తుల కదలికలను గుర్తించే ముఠా ఒంటరిగా తిరిగే జంటలపైనే పంజా విసురుతు న్నారని అన్నారు. ఆలయ పరిసరాల్లో మరుగుదొడ్లు మూత్రశాలలో ఉన్నప్పటికీ వాటికి తాళాలు వేయడంతో భక్తులు ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలోని గుట్ట పొదల్లోకి బహిర్భూమికి వెళ్తున్నారు.

ఇక్కడే మాటు వేసి నిందితులంతా ఒంటరిగా వెళ్లే మహిళలపై దాడులకు తెగబడుతున్న పరిస్థితి. ఊరుకొండ పేట ఆలయ పరిసరా ల్లోనూ బెల్ట్ షాపులు అధికంగా ఉండడంతో పోకిరీలు యువత తప్ప తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం వివాహితను సామూ హికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా గతంలోనూ కొంతమంది ఒంటరి జంటలను టార్గెట్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది. ఆలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న మహేష్ గౌడ్ తన స్నేహితులు తరచూ ఇలాంటి ఘటనల్లో పాలుపంచుకున్నారని పోలీసులు నిర్ధారించారు. 

తప్పుడు ప్రచారాలు చేయొద్దు: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి 

అత్యంత దైవ శక్తి గల ఊరుకొండ పేట అంజన్న ఆలయానికి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఎంతో మహిమగల ఈ అంజన్న ఆలయం వద్ద భక్తి భావంతోనే భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారని ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కానీ ఆలయానికి సుమారు 600 మీటర్ల దూరంలో ఘటన జరిగిందని ఆలయం వద్ద అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : మహిళ పై అఘాయిత్యం జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పక్కాగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. 

దోషులను ఉరి తీయాలి: కళావతమ్మ 

వనపర్తి:నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట వద్ద గత శనివారం మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘోరమని, దోషులను ఉరితీయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదాయం  పెంచుకోవటానికి మద్యంపై ఆధారపడటం సరికాదని గ్రామ గ్రామాన సందు సందుకు బెల్ట్ షాపులు నడుపుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ చౌరస్తాలో నిరసన 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు కొందరు వ్యక్తులు విచక్షణ అమర్చి దారుణాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమ ని ప్రజాసంఘాల నాయకులు అసహన వ్యక్తం చేశారు. ఊరుకొండ పేట లో మహిళపై జరిగిన వ్యాహిత్యాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా దగ్గర నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు తరానికి మనం ఏం నేర్పిస్తున్నాము ఒక్కసారి ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి చేదు ఘటనలో పునరావృత్తం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  సిఐటియు రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్,ఐద్వా జిల్లా నాయకురాలు వి. పద్మ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు గడ్డమీది గోపాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్దగాలన్న, వరద లక్ష్మయ్య,కురుమూర్తి ఉన్నారు.