calender_icon.png 29 December, 2024 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైమ్ రిపోర్ట్ విడుదల చేసిన పోలీస్ శాఖ

28-12-2024 10:45:19 PM

శాంతిభద్రతలు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘ

నేరాల నియంత్రణకే ప్రత్యేక చర్యలు

వివరాలు వెల్లడించిన ఎస్పీ డివి శ్రీనివాస్ రావు 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఏడాది జరిగిన నేరాల వివరాలను వెల్లడించారు.

2022 సంవత్సరంలో జిల్లా పరిధిలో 1457 కేసులు నమోదయ్యాయి.

2023 సంవత్సరంలో జిల్లా పరిధిలో 1063 కేసులు నమోదయ్యాయి.

ఈ సంవత్సరంలో జిల్లా పరిధిలో 1207 కేసులు నమోదయ్యాయి.

ఈ ఏడాది జిల్లాలో 12 హత్య కేసులు, 82  ఆస్తి సంబంధిత నేరాలు, 03 నేరపూరిత నరహత్యలు, 04 దొమ్మి కేసులు, 18 కిడ్నాప్ కేసులు, 24 రేప్ కేసులు, 34 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు,27 పోస్కో చట్టం కేసులు, 39 గంజాయి కేసులు, 32 సైబర్ నేరాలు, 188 మహిళల పై అఘాయిత్యాల కు సంబంధించిన కేసులను నమోదు చేశారు. కాగా గత సంవత్సరంలో లో 22 హత్య కేసులు, 109 ఆస్తి సంబంధిత నేరాలు, 5 నేరపూరిత నరహత్యలు , 05 దొమ్మి కేసులు, 24 కిడ్నాప్ కేసులు, 27 రేప్ కేసులు, 24 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, 20 పోస్కో చట్టం కేసులు, 17 గంజాయి కేసులు, 21 సైబర్ నేరాలు, 177 మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.

గత సంవత్సరంతో పోల్చగా...  

హత్య కేసులు 45.45 శాతం తగ్గినవి.

ఆస్తి సంబంధిత నేరాలు 24.77 శాతం తగ్గినవి.

నేరపూరిత నరహత్యలు  40 శాతం తగ్గినవి.

దొమ్మి కేసులు 20 శాతం తగ్గినవి.

కిడ్నాప్ కేసులు 25 శాతం తగ్గినవి.

రేప్ కేసులు 11.11 శాతం తగ్గినవి.

అట్రాసిటీ కేసులు 41.66 శాతం పెరిగినవి.

పాస్కో చట్టం కేసులు 35 శాతం పెరిగినవి.

సైబర్ నేరాలు 52.38 శాతం పెరిగినవి.

మహిళల పై అఘాయిత్యాలు  6.21 శాతం పెరిగినవి.

గంజాయి కేసులు 129.41 శాతం పెరిగినవి. 

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు:

ఈ ఏడాది 133 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 60 మంది మరణించారు, 91 మంది గాయపడ్డారు. 2023 సంవత్సరంలో 125 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా 70 మంది మరణించారు. 84 మంది గాయపడ్డారు. గత ఏడాదితో రోడ్డు ప్రమాదాలను పోలిస్తే 1.6 శాతం తగ్గాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి గ్రామ స్థాయిలో యువతకు సీపీఆర్, ప్రథమ చికిత్సపై శిక్షణ అందించడం, ప్రధాన రహదారుల వెంబడి ఉన్న దుకాణాలు, పెట్రోల్ పంపులు, మెకానిక్ దుకాణాలు మొదలైన వారిని గుర్తించి వారికి సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రమాదాల నివారణకు ప్రధాన చౌరస్తాల వద్ద జిల్లా పరిధిలో వాహనాల వేగాన్ని తగ్గించడానికి ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైన్ బోర్డ్స్, రబ్బర్ స్ట్రిప్స్ ,అప్రోచ్ రోడ్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ సేఫ్టీ ఎడ్యుకేషన్ లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు అండగా...

ఏడాది 34 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బాధితులకు పరిహారం అందజేసేందుకు కలెక్టర్ కు నివేదిక అందించారు. ఈ సంవత్సరంలో 1 కేసులలో బాధితురాలికి మొదటి స్టేజ్ లో రూ:.1,00,000 పరిహారంగా ఇవ్వడం జరిగింది. 2023 సంవత్సరంలో 24 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి .బాధితులకు పరిహారం కోసం అన్ని  ఫైళ్లను జిల్లా కలెక్టర్ కు పంపించగా. ఈ సంవత్సరంలో 11 కేసులలో బాధితులకి మొదటి స్టేజ్ లో రూ : 4,50,000,రెండవ స్టేజ్ లో 5 కేసులలో బాధితులకి రూ: 2,50,000, మూడవ స్టేజ్ లో 1 కేసులో బాధితురాలికి రూ: 25,000 అందజేశారు.

పోక్సో కేసులు: పోక్సో చట్టానికి సంబంధించి గత ఏడాది 20 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 27 కేసులు నమోదు చేశారు.

ప్రాపర్టీ రికవరీ: ఏడాది లో 82 ఆస్తి సంబంధిత నేరాలలో రూ : 62,08,562 విలువ గల నగధు/ ఆభరణాలు /ఇతర వస్తువులు దొంగిలించబడగా, 37 కేసులలో రూ :15,33,420 రికవరీ చేశారు.ప్రస్తుత సంవత్సరంలో రికవరీ శాతం 24.69 శాతం. చేధించబడినది 45.67 శాతం. 2023 సం. లో 109 ఆస్తి సంబంధిత నేరాల కేసులు నమోదు కాగా, 50  కేసులు గుర్తించారు. వాటిలో రికవరీ శాతం 15.91 శాతం చేధించబడినది 45.87 %.గత ఏడాదితో పోల్చగా ఆస్తి సంబంధిత నేరాలు 24.77 శాతం తగ్గాయి.  చేదించిన కేసులు 8.78 % పెరిగాయి. 

పెరిగిన సైబర్ నేరాలు: ఈ సంవత్సరంలో 21  కేసులు నమోదు చెయ్యడం జరిగింది. గత సంవత్సరం తో పోల్చుతే ఈ ఏడాది లో 52.38 % సైబర్ నేరాలు పెరిగాయి.

నిందితులకు శిక్ష పడేలా కృషి:

ఈ సంవత్సరంలో అన్ని కేసులలో కలిపి 48 మంది గాను శిక్షలు పడినట్లు ఇది గత సంవత్సరంతో(29) పోలిస్తే దాదాపు రెట్టింపు అయినట్లు ఎస్పీ తెలిపారు.

రాజి మార్గంలో కేసుల పరిష్కారానికి కృషి:

ఈ సంవత్సరం మూడు విడుతలుగా జరిగిన లోక్ అదాలత్ లో 2378 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేశారు.

చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీం: 

2023 సంవత్సరంలో క్లూస్ టీమ్ 28 కేసులకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 01 కేసు చేధించి నేరస్తులను అరెస్ట్ చేశారు.

ఈ సంవత్సరంలో క్లూస్ టీమ్ 23 కేసులకు గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 01 కేసు చేధించి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది.

మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (MSCD) సహయంతో 1127 మందిని తనిఖీ చేయడం జరిగింది. లైవ్ స్కానర్ సహాయంతో 18 మంది అనుమానిత వ్యక్తులను, మరియు 35 మంది నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుని తనిఖీ చేపట్టారు. 

డయల్-100 స్పందన:

డయల్-100 కాల్ ద్వారా జిల్లాలో ఏ ప్రాంతంనుండైనా నేర సమాచారం అందుకున్న 6 నిమిషాల వ్యవధిలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించారు.

రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట:

పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై 100 కేసులు నమోదు చేసి 170 మందిని అరెస్ట్ చేసి 1221.8 క్వింటాళ్ళ  పీడీఎస్ రైస్ ను సీజ్ చేశారు.

జూదంపై దృష్టి:

గేమింగ్ యాక్ట్/ జూదంలో 151 కేసుల్లో 605 మందిపై కేసులు నమోదు చేసి రూ: 4,83,670 నగదును సీజ్ చేశారు.

ఇసుక అక్రమ రవణపై దృష్టి: 

సంవత్సరంలో 13 ఇసుక  కేసులు నమోదు చేశారు

గంజాయి రవాణాపై పెంచిన నిఘ:

ఈ సంవత్సరంలో అక్రమ గంజాయి కేసులో 39 కేసులలో 65 మందిని అరెస్టు చేసి 298 కేజీల 855 గ్రామ్స్ ల మరియు 121 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వాంకిడి ఆర్టిఏ చెక్కపోస్ట్ వద్ద అక్టోబర్ 31న  వాహన తనిఖీలో నిందితుడు ఎండు గంజాయి రవాణా చేస్తున్న  MP06HC1339  కంటైనర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 281.7 కిలోల రూ :70,42,500 విలువచేసే గంజాయి ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరాయినాకు తీసుకెళ్తుండగా  వాంకిడి వద్ద పట్టుకొని  Cr.No. 159/2024, U/sec. 8(c) r/w. 20(b)(ii)(c) NDPS చట్టం కింద కేసు నమోదు నమోదు చేశారు. ఈ సంవత్సరంలో గంజాయి నిందితులపై 08 హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశారు.

పశువుల అక్రమ రవాణకు అడ్డుకట్ట:

2024 సంవత్సరంలో 45 కేసులు నమోదు చేసి 130 మంది నిందితులను అరెస్టు చేశారు, 628 పశువులను రక్షించారు.

ఆంటీ డ్రగ్ పై అవేర్నెస్: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. వీటితో పాటు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు  ప్రధానం అందజేశారు.

గంజాయి నిందితుల గుర్తింపుకు ప్రత్యేక చర్యలు: అనుమానిత వ్యక్తుల వద్ద, గతంలో గంజాయి కేసులలో ఉన్న నిందుతుల వద్ద గంజాయి నమూనాలు గుర్తించడానికి డ్రగ్ టెస్ట్ విత్ యూరిన్ కిట్స్ ను అన్ని పోలీస్ స్టేషన్ లలో అందుబాటులోకి తీసుకువచ్చి విసృతంగా టెస్ట్ లు నిర్వహించారు.

ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్:

ఆపరేషన్ స్మైల్ కార్యక్రమము ద్వారా 68 మంది పిల్లలను, ఆపరేషన్ ముస్కన్ ద్వారా 61 మంది పిల్లలకు విముక్తి కల్పించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు:

డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా 1290 కేసులలో 63,628 ఈ -చలన్ ద్వారా 11,373,310 రూపాయల పెనాల్టీ  విధించారు.

షీ టీం విస్తృత అవగాహన కార్యక్రమాలు షీ టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో  గుడ్ టచ్ /బ్యాడ్ టచ్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా పోలీస్ లకు విద్యార్థులకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడి ఫలితంగా బ్యాడ్ టచ్ బాధితులు స్వచ్చందంగా ముందుకు వచ్చి షీ టీమ్ కు ఫిర్యాదు చేయగా వారిపై కేసులు నమోదు చేశారు.

మావోయిస్టు కదలికలపై నిఘా:

హాని కలిగించే గ్రామాలలొ కార్దన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించడం, మతొన్మాద గ్రుపులలో చేరకుడదనే విశ్వాసాన్ని ప్రజల మనుసుల్లో పెంచారు. జిల్లా తీవ్రవాద ప్రభావిత  మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి జిల్లా వ్యాప్తంగా అనేక సి ఎ ఎస్ ఓ కార్యక్రమాలు నిర్వహించి, ల్యాండ్ మైన్స్, భూబీ ట్రాప్ లు మరియు డైరెక్షనల్ మైన్ లను మారుమూల ప్రాంతాల్లో గుర్తించి నిషేదించడానికి బిడి బృందం క్రమం తప్పకుండ రోడ్లు, కల్వర్టులు తనిఖి చేస్తుంది. నిత్యం పోలీసులు పెట్రోలింగ్, ఆకస్మిక వాహనాల తనిఖీలు, సి ఏ ఎస్ ఓ లు, కూంబింగ్ ఆపరేషన్ల కారణంగా జిల్లలో మవొయిస్ట్ ల కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా కమ్యూనిటి పోలిసింగ్ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, మారుమూల ప్రాంతాల్లో ని నిరుపేదలకు కిరణా సామాన్ల పంపిణి వంటి కార్యక్రమాలు జిల్లలో మవొయిస్ట్ కార్యకలాపాల పతనానికి దోహదపడ్డాయి.

సేవ కార్యక్రమాలలోనూ:

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, షీ టీమ్, రోడ్ సేఫ్టీ, గంజాయి, ఆన్లైన్ చీటింగ్లు, గుట్కా, జూదం మరియు మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 27.02.2024 న సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ (బాలురు) లో సిర్పూర్ టి 10 వ తరగతి విద్యార్దులకు 575 ఎక్సామినేషన్ కిట్లను (ప్యాడ్ లు ,పెన్నులు, ఇతర వస్తువులు) పంపిణీ చేశారు. 04.07.2024 న కేరమెరి పోలీస్ స్టేషన్ లో కొలంజరి గ్రామానికి చెందిన సిడం పగ్గుభాయ్ కి వీల్ చైర్, నిత్యవసర వస్తువులను ఎస్పీ అందజేశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన ఆదివాసి విద్యార్థిని మానేపల్లి శిరీష ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ర్యాంకు సాధించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నందు సీటు పొందింది.

(తండ్రి పెంటయ్య, కోళ్ల ఫామ్ నందు దినసరి కూలీ. తల్లి లక్ష్మీ). ఎం.బి.బి.ఎస్ సీట్ సాధించిన కూడా, వైద్య వృత్తి చదువుటకు ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నవని ఇట్టి విషయాన్ని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య, ఎస్సై రామారావుకు తెలపడంతో, ఎస్సై రామారావు తన మిత్రులు డల్లాస్ (USA) కు చెందిన దుర్గ రాజ్ కుమార్, లొకేశ్ సహాయంతో 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.వి శ్రీనివాసరావు అందించారు. చదువుకు పేదరికం అడ్డురాదని అందుకు శిరీష గొప్ప ఉదాహరణ అని ఎస్పీ తనని అభినందించారు. ఎంబిబిఎస్ సీట్ సాధించినందుకు ఆమెను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో బెజ్జూర్ మండలంలోని నాగవల్లి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లను, వైద్య శిబిరాన్ని నిర్వహించి, ఉచితంగా మందులను సరఫరా చేశారు. జైనూర్ మండల కేంద్రంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పేద ఆదివాసి మహిళలకు చేతన ఫౌండేషన్ వారి సహకారంతో ఉచితంగా 35 కుట్టుమిషన్లను అందజేశారు. రెబ్బెన మండలం గోండు గూడ గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులకు 500 దుప్పట్లు, యువకులకు  వాలీ బాల్ కిట్ పంపిణీ చేశారు. కౌటాల మండలం కనికి, హెట్టి, తాటిపల్లి గ్రామంలోని పేద ప్రజలకు 300 దుప్పట్లు పంపిణీ చేశారు. యువతకు ఒక వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు. పెంచికల్ పెట్ మండలం బొంబాయిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్వాల్ వాడలో గోగు. అంకుబాయి ఇల్లు భారీ వర్షానికి కూలి పోయిన సమాచారం తెలుసుకున్న ఎస్సై కొమురయ్య బాధ్యత కుటుంబానికి నగదుతో పాటు నిత్యవసర సరుకులు, బ్యాంక్లెట్ లను అందించి మానవత్వం చాటుకున్నారు. 

సిర్పూర్ యు మండలం పవర్ గూడ గ్రామం నందు ఏర్పాటు చేసిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్  సహకారంతో  ఆదివాసి మహిళలకు , వృద్ధులకు ఉచితంగా 400 దుప్పట్లు ,యువతకు 5 వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. నిరుద్యోగ అండగా జాబ్ మేళా: ఫిబ్రవరి 26న ఆసిఫాబాద్ లో 60 ప్రైవేట్ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. సుమారు 3000 మంది ఉద్యోగ ఆశవహులు హాజరయ్యారు, 815 మంది సభ్యులు వివిధ కంపెనీలలో వివిధ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రజా ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్: జులై 12 న కౌటాల మండలం తుమ్మిడి హట్టి గ్రామంలో కాగజనగర్ షణ్ముఖ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 800 మంది స్థానిక ప్రజలు హాజరు అయినారు , వారికి అవసరమైన వైద్య చికిత్సలు ఉచితంగా అందించారు. పేదలకు 300 దుప్పట్లు, యువతకు 30 హెల్మెట్లు & 05 వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. విజయవంతంగా రక్తదాన శిబిరం: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 550 మంది పోలీసులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ట్రాఫిక్ సమస్యలపై అవగాహన సదస్సు: ఆగస్టు 28న ఆసిఫాబాద్ లోని ప్రేమల గార్డెన్ లో ఒక మెగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు , దీనికి సుమారు 1000 మంది సభ్యులు హాజరు.

భరోసా కేంద్రం ద్వారా భద్రత కల్పిస్తూ:

జిల్లాలో భరోసా కేంద్రం ఫిబ్రవరి 2024 లో స్థాపించబడినది. సంవత్సరంలో మొత్తం 21 కేసులు రాగా, అందులో 15 పొస్కో , 6 రేప్ కేసులు ఉన్నాయి. భరోసా బృందం 14 మంది బాధితుల ఇళ్లను సందర్శించింది. భరోసా బృందం భరోసా సెంటర్ సేవలు, పోస్కో చట్టం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్, సోషల్ మీడియా ప్రయోజనాలు అప్రయోజనాలు మరియు టోల్ ఫ్రీ నంబర్లు 100,1098 గురించి వివరిస్తూ పాటశాలల్లో అవగాహన కార్యక్రమాలను కూడా రూపొందించారు. ముగ్గురు బాధితులు చార్జి షీట్ లెవల్ లో మరియు ఒకటి ఎఫ్. ఐ. ఆర్ లెవల్ లో పరిహారం పొందారు.

కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన: 

సైబర్ మోసాలు, బ్లాక్ మ్యాజిక్ (వశీకరణం), సోషల్ మీడియా దుర్గుణాలు (ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్), డ్రగ్స్, మద్యపానం, షీ టీం అవగాహన, మహిళలపై నేరం, రైతుల ఆత్మహత్యలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాధాలు, వృద్ధ తల్లిదండ్రులు, స్నేహపూర్వక పొలిసింగ్, ఉద్యోగ మోసం, పోలీస్ టెక్నాలజీలు, డయల్ 100, హక్ ఐ, ముఢనమ్మకాలు, మద్యం & గంజాయి వినియోగం, ట్రాఫిక్ నియమాలు, ర్యాగింగ్ మొదలైన వివిధ నేరాలు నీరోదించటానికి ప్రజల మద్య అవగాహన కల్పించడానికి కళాబృందం ప్రస్తుత సంవత్సరంలో (43) కార్యక్రమాలు నిర్వహించారు.

సమర్థవంతంగా పార్లమెంట్ ఎన్నికలు:

2024 పార్లమెంట్ ఎన్నికల్లో 26 సమస్యాత్మక గ్రామాలకు మరియు 69 పోలింగ్ స్టేసన్లు, అటవి ప్రాంతాలకు కూమ్బింగ్ ఆపరేషన్సు కు పంపించడం, రోడ్ & కల్వర్ట్ చెకింగ్ చేయించడం వల్ల ఎటువంటి తీవ్రవాద సంఘటనలు జరగకుండా చేయగాలిగాము. 449 మంది నేర చరిత కలిగిన వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం వలన ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో స్వేచ్చగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సుమారు 2,500 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పకడ్బందీగా ప్రణాళికలు సిద్దం చేసి విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, స్నేహపూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తూ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని  ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు.