calender_icon.png 1 February, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలి

01-02-2025 01:16:54 AM

* శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి 

* మల్టీ జోన్-1 ఐజి  చంద్రశేఖర్‌రెడ్డి

జగిత్యాల, జనవరి 31 (విజయక్రాంతి): నేరాల నివారణ, నేర చేధనలే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని, శాంతి భద్రతల కు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీజోన్-1 ఐజి  చంద్రశే ఖర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో ఐజి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సదర్బంగా ఎస్పీ అశోక్’కుమార్ జిల్లాలో  శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీ స్ శాఖ తీసుకుంటున్న చర్యలు, పోలీస్ అధి కారుల పనితీరు, జిల్లాలో నమోదైన కేసుల వివరాలను ఐజికి పవర్ పాయింట్  ప్రజెం టేషన్ ద్వారా వివరించారు.

ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, నేర నియంత్రణ, కేసుల విచా రణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసు కోవలసిన ప్రత్యేక చర్యల గురించి చర్చించా రు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎదురవతున్న సమస్యలను కూ లంకషంగా చర్చించి వాటి పరిష్కారానికి పలు సూచనలిచ్చారు. 

ఈ సందర్భంగా మల్టీజోన్-1 ఐజి  చంద్రశేఖర్’రెడ్డి మాట్లాడుతూ సమర్థవంత మైన పోలీసు వ్యవస్థతోనే  శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికా రులు, సిబ్బంది కషి చేయాలని సూచించారు.

నిజాయితీగా విధులు నిర్వహిస్తూ, పోలీ స్ శాఖ కీర్తి ప్రతిష్ఠలు పెంచే పోలీస్ అధికా రులకు, సిబ్బందికి ఎప్పటికీ అండగా నిలు స్తామని ఐజీ సూచించారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా  అదుపులో ఉన్నాయని, ఎస్పీ నేతత్వంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న కషి అభినందనీయమని పేర్కొ న్నారు.

ఎస్పీ, డీఎస్పీలు క్రమం తప్పకుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను ప్రత్యక్షంగా సందర్శించి, వారి పని తీరునూ సమీక్షిం చాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని నేర నియంత్రణకు కషి చేయాలని ఐజీ సూచిం చారు. రోజువారీ పెట్రోలింగ్ మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలన్నారు.

నేరస్థులను పట్టుకోవ టంలో, నేర పరిశోధనలో, సాంకేతిక ఆధా రాలను, సీసీ టీవీలను ఉపయోగించు కోవాలని  సూచించారు. పాత నేరస్థుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్’కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బందాల ను మరింత బలోపేతం చేయాలన్నారు.

డ్రగ్స్ సరఫరా, వినియోగం మీద ఉక్కుపా దం మోపాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని  సూచించారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వ హించాలని ఐజి  చంద్రశేఖర్’రెడ్డి పోలీస్  అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డీఎస్పీలు రఘుచందర్, అడ్డూరి రాములు, రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, కిరణ్’కుమార్, వేణుగోపాల్, రాంనర్సింహారెడ్డి, రవి, నిరం జన్’రెడ్డి, సురేష్’బాబు, కష్ణారెడ్డిలతో పా టూ జిల్లాలోని పలు స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.