calender_icon.png 26 January, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తతతో నేరాల అదుపు: డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి

25-01-2025 12:00:00 AM

కోహీర్, జనవరి 24: ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాలను అదుపు చేయడానికి సహకరించాలని జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలోని మిషన్ కంపౌండ్ మైదానంలో గురువారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నీ విజేతలకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నేరాల అదుపు పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి టోర్నీ నిర్వహించామన్నారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. డ్రగ్స్ వినియోగం విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తమ పిల్లలను పెంపకంలో తగు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసులకు సహకరించాలన్నారు. నేరాలకు సంభందించిన సమాచారాన్ని ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే తెలియ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజేత సంగారెడ్డి జట్టుకు రూ. 10 నగదు, కప్పు, రన్నర్ సూరారం జట్టుకు రూ. 8 వేలు, కప్పు మూడో స్థానంలో నిలిచిన జహీరాబాద్ పోలీసు జట్టుకు రూ. 5 వేలు, కప్పు అందచేశారు. కార్యక్రమంలో సీఐ శివలింగం. ఎస్త్స్ర సతీష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి, మాజీ ఎంపిపి శాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.