* ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
* అండర్ వరల్డ్ కప్‌లో సత్తాచాటడంపై సీఎం అభినందనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మహిళల అండర్ ట్వంటీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ. కోటి నజరానా ప్రకటించారు. అండర్ 19 వరల్డ్‌కప్ టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు ప్రకటించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మహిళా క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి త్రిషను అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు నజరానా ప్రకటించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఉన్నారు.