పుణెలోని గార్వేర్ మైదానంలో ఘటన
పుణె, నవంబర్ 29: కార్డియాక్ అరెస్ట్‌తో క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలిన ఘట న పుణెలో చోటు చేసుకుంది. పుణెలోని గార్వేర్ మైదా నంలో గురువారం జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో క్రికెటర్ ఇమ్రాన్ పటే ల్ (౩౫) ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా దిగి బాగా ఆడిన అతడు ఉన్నట్టుండి ఛాతి నొప్పితో బాధపడ్డాడు.
అదే విషయా న్ని ఎంపైర్లకు చెప్పి పెవీలియన్‌కు వ స్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. దీంతో అక్కడున్న వాళ్లు వెంటనే ఇ మ్రాన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కా ర్డియాక్ అరెస్ట్‌తో ఇమ్రాన్ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఇమ్రా న్ మరణ వార్తను విని ప్రేక్షకులు, ఆటగాళ్లు షాకయ్యారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.