10-03-2025 10:10:44 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఐపీఎల్ తరహాలో హరీష్ మెమోరియల్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా అంజనీపుత్ర ఎస్టేట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, మల్లికార్జున హాస్పిటల్స్ నిర్వాహకులు కారుకూరి రామచందర్, డాక్టర్ గోపతి శ్రీనివాస్ సహకారంతో బెల్లంపల్లి ఏఎంసి ఏరియా నెంబర్ 2 గ్రౌండ్ లో ఫిబ్రవరి 23 నుండి నిర్వహిస్తున్న బెల్లంపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మార్చి 9న విజయవంతంగా ముగిసింది. ఇందులో 14 ఫ్రాంచైజీస్ లకు సంబంధించిన టీమ్స్ పాల్గొన్నాయి. ఇందులో సన్నీ బాబు క్యాపిటల్స్ విజయం సాధించింది.
అలాగే రన్నర్ గా బూడిద గడ్డ బ్లాస్టర్స్ టీం నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మల్లికార్జున హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ గోపతి శ్రీనివాస్, హరీష్ మెమోరియల్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు నల్లవెల్లి అనిష్, లింగంపల్లి శివ, సాయి కృష్ణ, స్పాన్సర్స్ ఫ్రాంచజీస్ ఓనర్స్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో విజయం సాధించిన జట్టుకి అంజనీపుత్ర ఎస్టేట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి రూ 1,00,000 లను చైర్మన్ గుర్రాల శ్రీధర్ అందజేశారు. రన్నర్ గా నిలిచిన జట్టుకి డాక్టర్ గోపతి శ్రీనివాస్ మల్లికార్జున హాస్పిటల్స్ తరఫున రూ.50,000 లను అందించారు.