06-04-2025 08:13:38 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి తిలక్ క్రీడ మైదానంలో ఆదివారం మార్నింగ్ క్రికెట్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో బ్రదర్స్ లెవెన్ జట్టు విజయం సాధించింది. పోటీలలో ఆరు జట్లు పాల్గొనగా బ్రదర్స్ లెవెల్, గుడి పేట టైటాన్ జట్లు ఫైనల్ పోటీల్లో తలపడ్డాయి. టాస్ గెలిచిన బ్రదర్స్ లెవెల్ జట్టు 8 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 101 పరుగులు సాధించింది. రెండవసారి బ్యాటింగ్ కి దిగిన గుడిపేట టైటాన్స్ జట్టు 8 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. దీంతో 41 పరుగుల తేడాతో బ్రదర్స్ లెవెన్ జట్టు విజయం సాధించి రూ 10 వేల ప్రైజ్ మనీ దక్కించుకుంది. గెలుపొందిన బ్రదర్స్ 11 జట్టు నుండి నాగరాజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పొందారు. గెలిచిన బ్రదర్స్ లెవెన్ జట్టును నిర్వాహకులతో పాటు క్రీడాకారులు అభినందించారు.