విజేతగా పోలీస్ జట్టు...
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో ఆదివారం ఉత్సాహభరితంగా ప్రెస్ అండ్ ఆఫీసర్స్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీలో ప్రెస్ క్లబ్ పోలీస్ రెవెన్యూ సింగరేణి జట్లు పోటీపడ్డాయి. భరతమైన వాతావరణంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆయా శాఖల అధికారులను సిబ్బందిని ఉత్సాహపరిచాయి. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో డిఎస్పి రవీందర్ రెడ్డి, తాసిల్దార్ రాఘవరెడ్డిలు మాట్లాడుతూ.. నిత్యం పోలీసులు, రెవెన్యూ సింగరేణి అధికారులు వారి వారి శాఖల పరంగా విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతారన్నారు.
అదేవిధంగా అన్ని రంగాల వార్తలను ప్రజల సమస్యలను సేకరించడంలో జర్నలిస్టులు సతమతమవుతూ మానసిక పత్రిక గురవుతారన్నారు. వీరందరికీ ఇలాంటి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, పనిలో ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. అంతేకాకుండా ఆయా శాఖల అధికారులు సిబ్బంది మధ్య పరిచయాలు మెరుగు పడతాయని తద్వారా ప్రజలకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. డి.ఎస్.పి, తాహసిల్దారులు బ్యాటింగ్ బౌలింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతగా పోలీస్ చెట్టు నిలిచింది. ఈ కార్యక్రమంలో సిఐ సతీష్ కుమార్, మణుగూరు ఏరియా సింగరేణి డీజీఎం పర్సనల్ సలగల రమేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిండిగ వెంకట్, మారుతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.