calender_icon.png 17 November, 2024 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు

24-09-2024 12:00:00 AM

నిర్వాహకుడి అరెస్ట్.. రూ.8 లక్షలు స్వాధీనం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నగరంలో ఆన్‌లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజే మార్కెట్ రోడ్ వద్ద గల వాల్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ ముఠా కలెక్షన్ ఏజెంట్ వికాస్ జైన్ ఉంటూ బెట్టింగ్ దందా చేస్తున్నాడు. నిందితుడు గోవా కేంద్రంగా నడుస్తునన ఓ బెట్టింగ్ యాప్ ప్రధాన  నిర్వాహకులనుంచి  కమీషన్ పొందుతున్నాడు. యువతను ఆకర్షించేందుకు ‘హెచ్‌వైడీవీకాస్ గ్రూప్’ అనే వాట్సప్ గ్రూప్‌ను బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితు డి నుంచి రూ.8లక్షల నగదుతో పాటు ఓ మొబైల్, కౌంటింగ్ మెషిన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.