10-04-2025 11:05:55 AM
లాస్ ఏంజిల్స్ 2028లో ఒలింపిక్స్ (2028 Olympics) క్రీడల్లో భాగంగా టీ-20 ఫార్మాట్(T20 format)లో క్రికెట్ పోటీలు(Cricket competitions) జరగనున్నాయి. 128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించడం విశేషం. ప్రతిష్టాత్మకమైన బంగారు పతకం(Gold medal) కోసం ఆరు జట్లు మాత్రమే పోటీలో ఉంటాయి. చివరిసారిగా 1900లో పారిస్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌గా ఒలింపిక్స్‌లో ఆడారు. క్రికెట్ ఎల్ఏ 2028 క్రీడలలో భాగంగా ఉంటుంది. అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత 2032లో బ్రిస్బేన్‌లో జరుగుతుంది. పురుషులు, మహిళలు రెండింటిలోనూ పోటీపడే ఆరు జట్లతో ఎల్ఏ టోర్నమెంట్(LA 2028 Olympics) టీ-20 ఫార్మాట్‌లో ఆడబడుతుందని నిర్వాహకులు బుధవారం ధృవీకరించారు.
ప్రతి జట్టు నుంచి 15 మంది సభ్యుల చొప్పున 90 మంది క్రికెటర్లకు అనుమతిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(International Olympic Committee) పోటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2028 క్రీడలకు క్రికెట్ టోర్నమెంట్‌కు అర్హత ప్రమాణాలు ఇంకా నిర్ధారించబడలేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) కింద 12 పూర్తి-సభ్య దేశాలు ఉన్నాయి. మరో 90-పైగా దేశాలు T20ని అసోసియేట్ సభ్యులుగా ఆడుతున్నాయి. యుఎస్ఏ(USA) క్రీడలలో ప్రత్యక్ష స్థానం సంపాదించే అవకాశం ఉన్నందున, అర్హత ప్రక్రియ ద్వారా కేవలం ఐదు జట్లు మాత్రమే క్రీడలకు ఎంపికవుతాయి. రాబోయే ఒలింపిక్ క్రీడల్లో చేర్చనున్న ఐదు కొత్త క్రీడలలో క్రికెట్ ఒకటి. 2023లో LA28లో బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సర్లు), స్క్వాష్‌లతో పాటు క్రికెట్‌ను చేర్చడానికి ఐఓసీ ఆమోదం తెలిపింది.