10-03-2025 09:04:26 PM
మునిపల్లి: మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల వోక్సెన్ యూనివర్సిటీలో క్రికెట్ అకాడమీ త్వరలోనే ప్రారంభించనున్నట్లు క్రికెట్ అకాడమీ మాజీ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్ తెలిపారు. సోమవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిక్సెస్ సోర్స్ బిజినెస్ నవాజ్ అమన్, సొల్యూషన్ ఐఎన్సి అంథోనితో కలిసి యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతం ఎంఎస్‌కే ప్రసాద్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.
కంకోల్ యూనివర్సిటీ క్రికెట్ అకాడమీకి మంచి అనువైన స్థలం ఉందన్నారు. అందుకు ఇక్కడ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అంతకు ముందు క్రికెట్ కు సంబంధించి పలు విషయాలతో విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వోక్సెన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మేన్ విశాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.