calender_icon.png 19 February, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ శవానికి దహన సంస్కారాలు

14-02-2025 12:00:00 AM

తిమ్మాపూర్, ఫిబ్రవరి 13: గత కొన్ని ఏళ్లుగా గ్రామంలో ఒంటరిగా నివసిస్తూ అందరితో మమేకమై జీవ నం కొనసాగిస్తున్న ఓ వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామస్తులంతా కలిసి దహన సంస్కరణలు చేసిన ఘ టన కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రా మంలో గురువారం జరిగింది.

మన్నెం పెల్లి గ్రామానికి చెందిన గూడూరి అనసూర్య 80 గురువారం ఆకస్మి కంగా మృతి చెందింది. అనసూర్య గ్రామంలో నివసిస్తున్నప్పటికీ ఆమెకి కొడుకులు, బిడ్డలు ఎవరూ లేరు. సూ ర్య మృతి చెందిందన్న విషయం తెలు సుకున్న గ్రామస్తులతో పాటు సుధ గోని లక్ష్మీనారాయణ గౌడ్, స్వస్థలానికి చేరుకొని అంతిమయాత్ర వాహ నంలో ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ దహన సంస్క రణలో కిరణ్ గౌడ్, పొట్ట శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ నాయి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, సంపత్, కొమురయ్య,లు పాల్గొని దహన సంస్కరణలు చేశారు.