09-04-2025 12:47:25 AM
ఎంఈఓ మురళికృష్ణ
చిన్న చింతకుంట, ఏప్రిల్ 8 :విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు.మంగళవారం అల్లిపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడి పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. పాఠశాలలోని విద్యార్థులు బట్టి విధానాన్ని స్వస్తి పలకాలని ఆయన సూచించారు.
విద్యార్థులకు బోధనలు ఉపయోగపడే బోధన సామాగ్రిని ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం పర్వీన్, గ్రామ మాజీ సర్పంచ్ రఘువరన్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మహేందర్ రెడ్డి, స్నేహ, సి ఆర్ పి లు విజయసింహ, ప్రవీణ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.