calender_icon.png 13 March, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావవ్యక్తీకరణలో సృజనాత్మకత

19-02-2025 12:00:00 AM

వాక్పారుష్యముపవాదః కుత్పనమ్ అభిభర్తృనమితి

కౌటిలీయం 

“అనుచరులను, సహచరులను లేని దోషాలు ఆరోపించి తిట్టడం, వ్యంగ్యంగా నిందించడం, భయపెట్టడం.. వీటిని వాక్పారుష్యాలుగా చెపుతూ, వాటికి పణాలను (కొంత మొత్తం ధనం) దండనగా విధించా లి” అంటాడు చాణక్య. “ధీరులకు, ధరణివల్లభులకు వాక్పారుష్యము చన్నె../ మహా దారుణమది విషముకంటే దహనము కంటెన్!” అంటుంది సభాపర్వంలో ‘మహాభారతం’. తోటివారితో వ్యవహరించడం లో నాయకుని మాటతీరు బంధాలను పెంచుతుంది లేదా త్రుంచుతుంది.  

ఒక బిజినెస్ స్కూల్ తమవద్ద విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులను 20 సంవత్సరాల పిమ్మట వృత్తి ఉద్యోగాలలో వారు ఏ విధంగా రాణించారో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిపింది. ఆశ్చర్యక రంగా ఉన్నత స్థాయికి చేరిన వారెవరూ కాలేజీ టాపర్లు కారు. అయితే, వారికి బృందాలను ఏర్పరచడం, వారిని సమన్వయపరిచి ప్రభావవంతంగా పనిచేయించ డం తెలుసు. ముఖ్యంగా వారందరూ భావవ్యక్తీకరణ నైపుణ్యం అధికంగా కలిగి న వారిగా గుర్తించారు.

భావవ్యక్తీకరణ సంస్థ ఉన్నతిలోనైనా, వ్యక్తి సఫలతలోనైనా ముఖ్యభూమిక పోషిస్తుంది. తన వాదనతో ఎదుటివారిని ఒప్పించడానికి ప్రభావ, ప్రతిభావంతమైన భావవ్యక్తీకరణ అవసరమవుతుంది. ఇందులో కొత్తదనాన్ని చూపడం, ఎంపిక చేసిన పదాలను క్రమపద్ధతిలో కూర్చుకోవడం, ఇతరులను ఆకట్టుకునే శైలిని అల వరచుకోవడం, స్పష్టంగా, ఇతరులు మెచ్చే లా అందించాలి.

ఇందులోనే వారి పరిణతి, విజయం ఆధారపడి ఉంటాయి. ఈ ప్రక్రియలో ఈథోస్, పేథాస్, లోగోస్ అనే మూడు ప్రధాన భావనలను అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఈథోస్, పేథాస్, లోగోస్ విధానాలు.. వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకునేందుకు లేదా వ్యాపారంలో వినియోగదారులు, పెట్టుబడిదారు లు, ఉద్యోగులలో అపోహలు తొలగించి, సంస్థ లక్ష్యం వైపు నడిపించడానికి భావ వ్యక్తీకరణ సాధనాలుగా ఉపయోగపడతాయి.

విశ్వసనీయతకు తగిన ఫలితం

ఈథోస్ అనేది వ్యక్తి వ్యక్తిత్వం, విశ్వసనీయత, శీలం,  ప్రతిభలకు సంబంధించిం ది. అదేలా సంస్థపట్ల విశ్వసనీయతకు, పేరు ప్రఖ్యాతులకు సంబంధించింది. ఇది సంస్థ నైపుణ్యాలను, సాధించిన అవార్డులను, వినియోగదారుల వద్ద పొందిన నమ్మకాన్ని, సంబంధిత పరిశ్రమలో పొందిన గుర్తింపుకు ప్రతీకగానూ నిలుస్తుంది. సంస్థలు తమ కార్యాలయాలలో వీటి చిత్రాలను వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా అమరుస్తాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు వారి ఉత్ప త్తులను వాడడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించిన వ్యక్తుల/ సంస్థల సమీక్షలను కూడా పంచుకుంటాయి.

అలాగే, సంస్థలు తమ ఖాతాదారులు ఇచ్చిన దృవపత్రాలను, రేటింగులను, ప్రభుత్వాల లైసె న్సులను వినియోగదారులకు అందుబాటులో ఉంచి, వాటిని ప్రత్యేక ఆకర్షణగా చూపుతాయి. తమ ఉత్పత్తుల సమాచార విశేషాలను ముద్రించి వినియోగదారులకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటా యి. అంతేకాక, అవకాశం ఉన్న ప్రతి పారిశ్రామిక ప్రదర్శనలో పాల్గొని వినియోగ దారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి.

‘పేథాస్’ సహానుభూతి (సానుభూతిని కాదు)ని పంచుకోవడంతోపాటు భావోద్వేగాలను పండించే సందేశాలకు సంబం ధించింది. ఎదుటివారిలో ఆశ్చర్యాన్ని, ఉద్వేగాన్ని కలిగించి వక్త లేదా నాయకుడు తమ వాదనలతో అందరూ ఏకీభవించేలా చేసే ప్రక్రియగా ఇది ఉంటుంది. ఇందులో నాలుగు దశలు ఉంటాయి. మానసికంగా సన్నద్ధమవడం  ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎదురవబోయే ప్రశ్నలు, వాటికి సమాధానాలేమిటి వంటివి.

ఇవన్నీ సన్నద్ధతలో భాగాలే. తదుపరి మనసులో అన్నీ క్రమపద్ధతిలో కూర్చుకునేం దుకు అవసరమైన సమయాన్ని తీసుకోవ డం. ఆ పిమ్మట దానిని వ్యూహంగా మార్చుకోవడం. చివరగా వ్యూహాన్ని పరిశీలించుకోవడం. ఈ నాలుగు మార్గాల గుండా సాగిన ప్రభావ, ప్రతిభావంతమైన భావ వ్యక్తీకరణ ఎదుటివారిని విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇక, ‘లోగాస్’ సంస్థకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధా న పాత్ర పోషిస్తుంది. సంస్థలు తాము సేకరించిన సమాచారాన్ని లోతుగా విశ్లేషిం చుకుంటాయి. తమ ఉత్పత్తులు లేదా సేవ ల ప్రభావాన్ని ప్రదర్శించడానికి సమాచారాన్ని, గణాంకాలను, తాము చేసిన పరిశో ధనలను ఉపయోగిస్తాయి. తమ ఉత్పత్తు ల నాణ్యత, ధరలను పోటీదారుల నాణ్య త, ధరలతో పోల్చి వినియోగదారునికి నచ్చచెప్పడం, వారికి కలిగే అదనపు ప్రయోజనాలను ప్రత్యేకంగా చూపడం,

ఉత్పత్తులు వివిధ సంస్థల ఉత్పాదనా సామర్థ్యం పెరగడంలో ఎలా ఉపకరించాయో, వాటిని ప్రత్యేక అధ్యయనంగా చేసి చూపడం, నిర్దిష్టమైన సాంకేతిక వివరణలను సహేతుకంగా, తార్కికంగా విని యోగదారులకు అందించడం వంటివన్నీ చేస్తుంటాయి. దానికి అదనంగా వినియోగదారులకు కలిగే సందేహాలన్నింటినీ సమర్థవంతంగా నివృత్తి చేయగలిగిన బృందాలను ఏర్పరచి, వాటి సేవలను ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం ఈ విభాగంలో జరుగుతుంది.

నైక్, ఆపిల్, డోవ్ లాంటి సంస్థలు, పలు ఫార్మస్యూటికల్ సంస్థలు ఈ ‘ఈథోస్, పేథాస్, లోగోస్’ లాంటి విధానా లను అవగాహన చేసుకోవడం, వ్యూహాత్మకంగా ఆచరణలో పెట్టడం ద్వారా వినియో గదారులను ఒప్పించడం, మెప్పించడంలో సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ.. విపణి వీధిలో తమ భాగస్వామ్యాన్ని అధికం చేసుకుంటున్నా యి. ఒక టూత్‌పేస్ట్ కంపెనీ తమ ఉత్పత్తులను పంటి డాక్టర్ సిఫారస్ చేసాడని ప్రక టనలు ఇస్తుంది.

ఓ కూల్ డ్రింక్ కంపెనీ కుటుంబ సభ్యులందరూ తమ డ్రింక్ తీసుకొని ఆహ్లాదంగా ఉన్న యాడ్‌ద్వారా భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఒక కార్ల కంపెనీ తమ కారు ఇంధన సామర్థ్యా న్ని ప్రత్యేకంగా చూపుతూ ప్రచారం చేస్తుం ది. ఈ క్రమంలో సరైన మాటతీరును ప్రదర్శించలేని సంస్థలు ఎక్కువ కాలం నిలువ డం కష్టమైన ప్రక్రియే అవుతుంది.

-పాలకుర్తి రామమూర్తి