జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): జలమండలి పరిధిలోని ప్రతి మేనేజర్ ఇంటింటికి వెళ్లి ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జలమండలి అమలు పరుస్తున్న వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం ( ఓటీఎస్ శుక్రవారం ఈడీ మయాంక్ మిట్టల్‌తో కలిసి అశోక్ రెడ్డి.. జలమండలి డైరెక్టర్లు, సీజీఎం, జీఎంలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటీఎస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
ప్రతి డివిజన్‌లోని బిల్లు చెల్లించని వారికి నోటీ సులు అందించాలని అన్నారు.- ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలతో దీర్ఘకాలికంగా బిల్లు చెల్లించకుండా ఉన్న వినియోగదారులను గుర్తించి.. వారి సమస్యను పరిష్కరించడానికి సీజీఎంలు చొరవ చూపాలని అన్నా రు. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి నివృతి చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్- డైరెక్ట్ స్వామి, సీజీఎమ్‌లు, జీఎమ్‌లు పాల్గొన్నారు.