calender_icon.png 5 March, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రేజీ స్టార్ - 2025 అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరణ

03-03-2025 12:00:00 AM

మందమర్రి, మార్చి 2 (విజయక్రాంతి) : క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 4న పట్టణంలో నిర్వహించనున్న క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు- 2025 పోస్టర్ ను పట్టణ ఎస్సు శివనీతి రాజశేఖర్ ఆవిష్కరించారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వివిధ రంగాలలో సేవలందిస్తూ రాణిస్తున్న వారిని గుర్తించి అవార్డులను ఇవ్వడం అభినందనీయమని ఆయన నిర్వాహకుల సేవలను కొనియాడారు. అకాడమీ వ్యవస్థాపకులు అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రతిభ కనబరిచిన కళాకారులకు అవార్డులని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రజా కవులు దరువు ఎల్లన్న, తీన్మార్ రవి, మాట్ల తిరుపతి, పల్లె నరసింహ, బోగే అశోక్, యూట్యూబ్ స్టార్స్ సౌజన్య, అమూల్య, స్నేహ, రౌడీ హరీష్, పూజ, తదితరులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్, ఉపాధ్యక్షులు సకినాల శంకర్, క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ అధ్యక్షులు పులిపాక శ్రీనివాస్, ప్రోగ్రాం ఆర్గనైజర్స్ అంతర్పుల మధు, కలువల శ్రీనివాస్, ఉప్పులేటి రాజమౌళి, ఎనగందుల. రజినీకాంత్, సీనియర్ డాన్స్ మాస్టర్స్ రాకం సంతోష్, కొండపర్తి సదానందం, సునార్కర్ రాంబాబు లు పాల్గొన్నారు.