calender_icon.png 15 March, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా క్రేజీ స్టార్ అవార్డు వేడుకలు

05-03-2025 06:53:03 PM

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రజా కవులు, యూట్యూబ్ స్టార్స్..

మందమర్రి (విజయక్రాంతి): క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భేరి ఈశ్వర్, కవి గాయకులు ఓయూ జేఏసీ నేత డాక్టర్ దరువు ఎల్లన్న, కవి గాయకులు డాక్టర్ తీన్మార్ రవి, అంజనీపుత్ర రీయల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ పిల్లి రవి, కాంగ్రెస్ యువ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, యూట్యూబ్ స్టార్స్ సందీప్ సక్సేనా, రౌడీ రాజేష్, కోటి అమూల్య, మొగిలిపాక స్నేహ, దేవికా రాణి, నీతు క్వీన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా కవి, ఓయూ జేఏసీ నేత డాక్టర్ దరువు ఎల్లన్న మాట్లాడుతూ... మందమర్రి మట్టిగడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నదని తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమానికి ఈ ప్రాంతం అండగా ఉందని ఆయన అన్నారు.

కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లిన తెలంగాణ ధూమ్ ధామ్ ఇదే గడ్డపై ప్రారంభమైందన్నారు. తెలంగాణ జానపద కళాకారులు ప్రపంచమే నివ్వెరపోయేలా యూట్యూబ్ రంగాన్ని శాసిస్తున్నారని, సినిమా పాటలతో పోటీపడి రాణిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయా రంగాల్లో రాణిస్తూ సేవలందిస్తున్న 50 మందికి క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు వై ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా, తెలంగాణ ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు అంతడుపుల నాగరాజు, అకాడమీ ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్, అధ్యక్షులు పులిపాక శ్రీనివాస్, బండ శాంకరి, ఉప్పులేటి గోపిక, రేగుంట చంద్రశేఖర్, సీనియర్ కళాకారులు సాదనవేణ ప్రభాకర్, రాజేశ్వర్, హనుమాండ్ల మధు, రాకం సంతోష్, క్రేజీ విజయ్, ఆసం కళ్యాణ్, ఉప్పులేటి రాజమౌళి, కల్వల శ్రీనివాస్, రమేష్ రాజాలు పాల్గొన్నారు.