calender_icon.png 25 February, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మిర్లు బాధిస్తున్నాయా?

23-02-2025 12:00:00 AM

నిద్రపోతున్నప్పుడు చేతులు, కాళ్ళు తిమ్మిర్ల బారిన పడటం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే ఈ పరిస్థితి కొంతకాలం పాటు ఉండొచ్చు. కాని ఈ సమస్య పదే పదే బాధిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. చేతులు, కాళ్లకు తిమ్మిరి వస్తే నిద్రకు అంతరాయం కలుగుతుంది. దాంతో ఒత్తిడి కారణంగా రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే డయాబెటిస్, విటమిన్స్ లోపం లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల కారణంగా తిమ్మిర్లు బాధిస్తాయి. ఎక్కువసేపు ఒకే స్థితిలో నిద్రపోతే చేతులు, కాళ్ళు తిమ్మిర్ల బారిన పడుతాయి. అందుకే ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిద్రపోవడం మానుకోవాలి. శరీరంపై ఒత్తిడి పడకుండా తేలికపాటి వ్యాయామం చేయాలి. అయినా తిమ్మిర్ల సమస్య కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.