calender_icon.png 5 October, 2024 | 8:52 AM

నకిలీ వైద్యులపై ఉక్కుపాదం

05-10-2024 01:41:03 AM

300 మంది నకిలీ వైద్యులపై కేసులు 

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 300 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేయించినట్లు ఆయన వెల్లడించారు.

శుక్రవారం కోఠిలోని వైద్య, ఆరోగ్య శాఖ క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ భవనాన్ని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు ప్రారంభించారు. అనంతరం మెడికల్ కౌన్సిల్ పనితీరును మహేశ్‌కుమార్ వివరించారు. నకిలీ వైద్యులపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టం మేరకు పోలీసు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా అన్ని మెడి కల్ కళాశాలల ప్రొఫెసర్లకు మెడికల్ ఎథిక్స్‌పై శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఎథి క్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.

రాష్ట్రంలోని వైద్యులకు 5 ఏళ్లకు ఒక  సారి జారీ చేసే లైసెన్స్ రెన్యువల్ కోసం తొ లిసారిగా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ట్లు వెల్లడించారు. ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ ద్వారకానాథ్, టీఎంసీ వైస్ చైర్మ న్ డాక్టర్ శ్రీనివాస్, నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.