calender_icon.png 15 November, 2024 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ ఎరువులు, మందుల విక్రేతలపై ఉక్కుపాదం

10-11-2024 01:40:46 AM

రాష్ట్ర ప్రణాళికా సంఘంవైస్ చైర్మన్ చిన్నారెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులను విక్రయించే కంపెనీలు, వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి సూచించారు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు.

శనివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగి న వ్యవసాయ అధికారుల శిక్షణ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని, సారవంతమైన నేల, నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, నాణ్యమైన క్రిమిసంహాకర మందులు, మార్కెటింగ్ విషయాలు వ్యవసాయ అధికారులు రైతులు అండగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలో కూరగాయల కొరత ఉందని, వాటి ఉత్పత్తి పెరిగేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 

క్రాప్ సర్వేకు సహయకులను నియమించాలి

క్షేత్రస్థాయిలో తమపై ఉన్న పనిభారాన్ని అర్థం చేసుకొని క్రాప్ డిజిటల్ సర్వే పనుల కోసం తమకు సహాయంగా మరొకరిని నియమించాలని కోరినట్లు ఏఈఓలు తెలిపారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న విలెజ్ రెవెన్యూ అసిస్టెంట్, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్, మహిళా స్వయం సహాయక ఉద్యోగులను క్రాప్ డిజిటల్ సర్వే పనులకు వాడుకునేలా అనుమతి ఇవ్వాలని చిన్నారెడ్డిని కోరారు.