17-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డీఏ లు వెంటనే ఇవ్వాలని, అన్ని ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ అమలు చేయాలని, పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాల ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు ప్రతినెల ఒకటో తేదీనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీ సర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గోపు లక్ష్మీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టిజీఈఏ జేఏసీ జిల్లా కార్యదర్శిగా తాను ఎన్నికయ్యేందుకు సహకరించిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు వడ్డెబోయిన శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, నాగవెల్లి రంజిత్ కుమార్, పూసపాటి నాగమునికి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. పిఆర్సి ప్రకటించాలని, ఉద్యోగులకు సంబంధించి గత సంవత్సర కాలం గా పెండింగ్ లో ఉన్న సప్లమెంటరీ బిల్లులు ఇవ్వాలని, ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్మీకాంత్ కోరారు.