25-02-2025 01:48:46 AM
కరీంనగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): కరీంనగర్-మెదక్- నిజామాబాద్ -ఆదిలాబాద్ పట్టభద్రులు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్య ర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ర్ట కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని రాష్ర్ట అధ్యక్షులు స్థిత ప్ర జ్ఞ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ లు తెలిపారు.
ఈ మేరకు సోమవారం మం త్రి శ్రీధర్ బాబును కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో వీటిని నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.