* జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, జనవరి 29 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు ఆపదలో ఉన్నప్పుడు, ఇతర అత్యవసర సమయాల్లో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ సంజీవనిలా పని చేస్తుందని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో బుధ వారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వ హించిన ‘ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్’ ట్రైనింగ్ కార్యక్రమంలో ఎస్పీ అశోక్’కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది భయపడి దూరంగా ఉంటారని, కానీ ఆ సమయంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి ఒక ప్రాణం కాపాడితే వాళ్లు జీవితాంతం మి మ్మల్ని మర్చిపోరన్నారు. దీన్ని ఒక సామా జిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించా లన్నారు.
అనవసరంగా కేసులు అవుతా యనే భయం వీడి, మానవతా దక్పథంతో ఆపదలో ఉన్న వారిని రక్షించాలని హితవు పలికారు. మనిషి ప్రాణం చాలా విలువైన దని, ఆపద సమయంలో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ ట్రైనింగ్ తీసుకొని అత్యవసర సమయంలో ఉపయోగించాలని సోషల్ సర్వీస్ రెస్పాండ్ సభ్యులకు కలెక్టర్ సత్యప్ర సాద్ తెలియజేశారు.
ఎస్పీ అశోక్’కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే 74 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలపై ప్రత్యేక దష్టి సారించి తగు జాగ్ర త్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించ వచ్చని పేర్కన్నారు. ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్’ఫై ప్రతి ఒక్కరూ అవసరమైన అవగాహన పెంచుకోవాలని ఎస్పీ వివరించారు.
ఈ సందర్భంగా ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన మాడల్ సిపిఆర్ బొమ్మపై కలెక్టర్ స్వయంగా సిపిఆర్ చేశారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఎస్పీతో కలిసి సోషల్ సర్వీస్ రెస్పాండ్ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ హేమం త్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్’రెడ్డి పోలీస్ అధికారులు, సోషల్ రెస్పాండ్ సభ్యులు పాల్గొన్నారు.