నిజామాబాద్ ఫిబ్రవరి 2: (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ పత్రి వైద్యురాలు డాక్టర్ పద్మరాజు ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఒకరికి అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.విమానంలో ప్రయాణించే తోటి ప్రయాణికులు అంతా అభినందనలతో డాక్టర్ ప్రతిమ రాజ్ ని గౌరవించారు.
అనురాధా అనే మహిళ ప్రయాణి కురాలు విజయవాడ నుంచి తన స్వస్థలం హైదరాబాద్ కు వెళుతుండగా ప్రయాణం మధ్యలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటనతో విమాన సిబ్బంది అత్యవసర వైద్యానికి అనౌన్స్మెంట్ చేస్తూ ఎవరైనా వైద్యులు వైద్యులు వెంటనే వచ్చి ఆమెకు వైద్యశాల అందించాలని కోరారు స్పందించిన డాక్టర్ పతిమారాజ్ వెంటనే సి పి ఆర్ చేసి ఎమర్జెన్సీకి ఆక్సిజన్ పరికరాలతో పాటు తన దగ్గర ఉన్న మెడికల్ కిట్లతో పశ్చిమగోదావరి అనురాధ అనే బాధితురాలికి వైద్య సేవలు అందించారు.
ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. గుండె నొప్పితో బాధపడి అపస్మాదుక స్థితిలో ఉన్న అనురాధ వెంటనే కోలుకొని ఉపశమనం పొందారు. శ్వాస ఇబ్బందిగా ఉన్న మహిళ తిరిగి యధాస్థితికి వచ్చారు. రోగి బంధువులు ప్రయాణికులు విమాన పైలట్ సిబ్బంది పరిస్థితి చెక్కబడడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా సంతోషంతో చప్పట్లు కొట్టి డాక్టర్ పతిమరాజుకి అభినందనలు తెలిపారు.
సకాలంలో స్పందించి తనకు వైద్య సేవలు అందించి అపాయస్థితి నుంచి కాపాడిన ప్రతిమ రాజ్ కు అనురాధ కృతజ్ఞతలు తెలిపారు తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రతిమ రాజ్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె కన్నీటి పర్యంతం డాక్టర్ పశ్చిమ రాజ్ కు అభివందనం చేశారు