calender_icon.png 18 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగిపోయిన చిన్నారి గుండె.. కాపాడిన 108 సిబ్బంది

18-01-2025 12:23:32 PM

హైదరాబాద్: అంబులెన్స్ పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (Emergency Medical Technician) సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల శనివారం మెదక్‌లో నవజాత శిశువు ప్రాణాలను కాపాడారు. రెండు రోజుల నవజాత శిశువు 108 సిబ్బంది పీసీఆర్  చేసి ప్రాణాలు కాపాడారు. మెదక్ పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన గర్బిణీ అమీనా బేగంకు శుక్రవారంమెదక్ మాతా శిశు కేంద్రంలో బాబు పుట్టింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శిశువును వైద్యులు సిఫార్సు చేసినట్లు మెరుగైన చికిత్స కోసం 108లో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి(Niloufer Hospital) తరలిస్తుండగా మార్గం మధ్యలో నర్సాపూర్ వద్దకు రాగానే చిన్నారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు 108 సిబ్బంది గుర్తించారు. ఆ క్లిష్టమైన సమయంలో తక్షణమే స్పందించిన అంబులెన్స్ పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాజు, నవీన్ సీపీఆర్ చేశారు. కొంతసేపటికే ఆ చిన్నారి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ లో చేర్పించారు. సీపీఆర్(CPR) చేసిన చిన్నారి ప్రాణాలు కాపాడిన నవీన్, ఈఎంటీ రాజును ఆస్పత్రి వైద్యులు ప్రశంసించారు.