calender_icon.png 1 February, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపై సీపీఎంది రాజీలేని పోరాటం

01-02-2025 12:32:11 AM

పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట, జనవరి 31: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసేది సిపిఎం అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్న ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రశ్నిస్తామని అన్నారు. శ్రామికుల దోపిడి, సామాజిక అణచివేత ,సరళీకృత ఆర్థిక విధానాలపై బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, సైదులు, గోపి లు పాల్గొన్నారు