11-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి) : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ, పెంచిన ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. భగత్ సింగ్ నగర్ లో గురువారం కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పెదాల, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాదని మండి పడ్డారు. కార్పొరేట్ బడావ్యాపారుల కోసం తాపత్రయ పడే బీజేపీ ప్రభుత్వానికి పేదల గురించి పట్టడం లేదని అన్నారు. గ్యాస్ సబ్సిడీ సైతం తొలగించి వేసింది అని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, నాయకులు మంజుల, బొజ్జ ఆశన్న, ప్రభు, ఆశన్న, అర్ఫా బేగం, పూసం సయ, రేణుక, మయూరి ఖాన్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.