24-02-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్, ఫిబ్రవరి23: పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్ లు తెలిపారు. అభ్యర్థిఈరోజు స్థానిక ఆదివారం నగరంలోని ప్రెస్ భవన్ లో సిపిఎం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్,అదిలాబాద్,మెదక్, ప్రస్తుత 13 జిల్లాల కార్యదర్శులతో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లాలలో నలుగురు బిజెపి ఎంపీలు ఉండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని, తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బిజెపి నెరవేర్చలేదని అన్నారు.
విద్య, సామాజిక సేవ అనుభవం ఉన్న వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నే అని 13 జిల్లాల కార్యదర్శిల అభిప్రాయం, సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి అయిన వూట్కూరి నరేందర్ రెడ్డి కి సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూన్నమని, నరేందర్ రెడ్డి గెలుపుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, మేధావులను, గ్రాడ్యుయేట్లను, కలిసి విస్తృత ప్రచారం చేసి నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య, నిజాంబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కె.చంద్రశేఖర్, మెదక్ జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్, జగిత్యాల జిల్లా కార్యదర్శి పి శ్రీకాంత్, నిర్మల్ జిల్లా దుర్గం నూతన్, ఆదిలాబాద్ జిల్లా లంక రాఘవులు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కోట శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జి బీమా సాహెబ్ పాల్గొన్నారు.