వివరాలు వెల్లడించిన ఇల్లందు డిఎస్పి
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కొమరారం పోలీలు పూణెం రమేష్ బాబు అలియాస్ వినోద్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దళ కమాండర్ ను అరెస్టు చేసినట్లు ఇల్లందు డిఎస్పి చంద్రభాను వెల్లడించారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పూనం రమేష్ 2013 నుండి అజ్ఞాత దళంలో తిరుగుతున్నాడు. గతంలో ఇతనిపై వ్యాపారస్తులను బెదిరించిన కేసులు, ఫారెస్ట్ ఆఫీసర్లను బెదిరించిన కేసులు నమోదయాయ అన్నారు. పూనెం రమేష్ పై ఇల్లందు సబ్ డివిజన్లో మొత్తము 06 కేసులున్నాయని తెలిపారు.
అజ్ఞాతంగా పనిచేస్తున్న దళ సభ్యులు, నాయకులు స్వచ్ఛందంగా తమంతట తాముగా జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి గౌరవప్రదమైన తగిన పునరావాసం తెలంగాణ ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ మాయ చేస్తూ అమాయకుల వద్ద నుండి చందాల రూపంలో దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా నిరాకరించిన వారిని బెదిరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు ఆదివాసి ప్రజలను, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అజ్ఞాత దళ నాయకులమని చెప్పి డబ్బులు వసూలు చేసిన, బెదిరించిన పోలీస్ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.