calender_icon.png 19 April, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం మహనీయులు నివాళులు

12-04-2025 03:14:00 PM

పద్మశ్రీ వనజీవి రామయ్యకు సంతాపం

ఇల్లెందు,(విజయక్రాంతి): సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యదర్శి మాకినేని బసవపున్నయ్యతో పాటు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జిల వర్ధంతులు సందర్బంగా సీపీఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం వారి చిత్ర పటానికి పూల మాల వేసి  నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారి ఆశయా సాధనకు కృషి చేయాలని, అఖిల భారత మహాసభ తీసుకున్న కర్తవ్యలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, తాళ్లూరి పద్మ, వజ్జ సురేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపం 

పద్మశ్రీ వనజీవి రామయ్య అనారోగ్యంతో మృతి చెందడం భాదకరం అని, వారి మృతి ప్రకృతి పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటన్నారు. వారి మరణానికి సీపీఎం ఇల్లందు మండల కమిటీగా సంతాపం ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరు వారి అడుగు జాడల్లో నడుస్తూ ప్రకృతిని ప్రేమించాలని ప్రకృతిని మనం రక్షించినప్పుడే అది మనని రక్షిస్తుందని కావున చెట్లను, ప్రకృతి ని కాపాడుకోవాలని కోరారు.