భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ అభయాంజనేయ స్వామి గుడి ఆలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జివివి సుదర్శన్ రావుని సిపిఎం బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చములు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి సుదర్శన్ రావు పనిచేయాలని కోరారు. రామాలయ అభివృద్ధిలో నిర్వాసితులవుతున్న పేదలకు పూర్తి న్యాయం చేసేందుకు అభయాంజనేయ స్వామి గుడి ఆలయ అభివృద్ధి కమిటీ కూడా కృషి చేయాలని సూచించారు.
వైద్య వృత్తితో పాటు లైన్స్ రోటరీ ఐఎంఏ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సుదర్శన్ రావు సుదీర్ఘకాలంగా అనేక రకాల సేవ కార్యక్రమాలలో ముందుంటున్నారని అభినందించారు. భవిష్యత్తులో ఆలయ కమిటీ చైర్మన్ తో వచ్చిన గుర్తింపుతో సుదర్శన్ రావు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి, వెంకట రామారావు, పారెల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి, ఉస్తేల జ్యోతి, ఐద్వా నాయకులు ఎర్రంశెట్టి పూర్ణిమ, గడ్డం నాగలక్ష్మి తదితరులు పాల్గొని సుదర్శన్ రావుకి శాలువా కప్పి సన్మానించారు.