calender_icon.png 3 April, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాచకొండ సీపీ సుధీర్ బాబును కలిసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

27-03-2025 11:12:03 PM

రామోజీ యాజమాన్యం ఆక్రమించుకున్న పేదల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని వినతి.. 

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రామోజీ యాజమాన్యం ఆక్రమించుకున్న పేదల ఇళ్ల స్థలాల భూ సమస్యను పరిష్కరించాలని రాచకొండ సిపీ సుధీర్ బాబును కలిసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్ కోరారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వేనెంబర్ 189/1, 203లో 2007 సంవత్సరంలో ప్రభుత్వం ఇంటి స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చిన పేదలందరూ కలిసి తమ స్థలాల్లోకి వెళ్తే పోలీసులు అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి 60 గజాల చొప్పున ఇంటి స్థలం పట్టాలు ఇచ్చి నక్ష ప్రకారం పొజిషన్ కూడా చూపించారన్నారు.

ఈ ఇండ్ల స్థలాలను రామోజీ యాజమాన్యం అక్రమించి లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి రాకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇంటి స్థలాలకు వెళ్లే దారిలో కందకాలు తీశారన్నారు. ప్రభుత్వ రోడ్డును కూడా రామోజీ యాజమాన్యం ప్రజలును రానివ్వకుండా అడ్డుగోడ నిర్మించుకుందన్నారు. ఈ పోరాటంతో ఇంతటితో ఆగకుండా రామోజీ ఆధీనంలో ఉన్న మరో 370 ఎకరాలను కూడా 10 వేల మందిని సమీకరించి ఆక్రమిస్తామని హెచ్చరించారు. ఒక 18 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న పేదలపై కేసులు నమోదు చేయడమే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మా రైతులకు తిరిగి భూములపై చెప్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

మళ్లీ ఫ్యూచర్ సిటీ పేరుతో 2500 ఎకరాల భూములను పేదల నుంచి సేకరించేందుకు పూనుకుంటుందన్నారు. ఈ క్రమంలో సీపీఐఎం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర ముగింపు సందర్భంగా పోలీసులు ముందుగా అనుమతి ఇచ్చి చివరకు నిరాకరించాలన్నారు. ఫార్మా భూముల్లోకి సీపీఐఎం నేతలు, రైతులు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేశారని గుర్తుచేశారు. ఇది సరైంది కాదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సిహెచ్, బుగ్గ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ జంగయ్య, ఇళ్లస్థలాల పోరాట కమిటీ కన్వీనర్ జగన్, మండల కమిటీ సభ్యులు ఆనందం, నర్సింహ, ఏ నర్సింహా, నాయకులు యాదయ్య, బాలరాజు, శ్రీను, చరణ్, యాదగిరి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ తదితరులు ఉన్నారు.