calender_icon.png 1 April, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అక్రమ అరెస్టు..

26-03-2025 10:49:44 PM

సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండన..

సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజు..

సంగారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై పోరాడుతున్న పేదల అండగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ  భూముల మీదకి పోయినందుకు అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించారు. జాన్ వెస్లీను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిలో వారికి ఇవ్వాలని అడగడం నేరమా... పేద ప్రజల కోసం పోరాడుతుంటే అరెస్టు చేస్తారా.? ప్రశ్నించారు. భూ కబ్జా కోరును అరెస్టు చేయకుండా ఇళ్ల స్థలాల హక్కుదారులను అరెస్టు చేయడం సిగ్గుచేటని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మరి కొందరు నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు.