కొండపాక, జనవరి 17 : సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర నాల్గవ మహాసభలు ఈనెల 25 నుంచి 28 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు, సిపిఎం పార్టీ సభ్యులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, అసంఘటిత రంగ, సంఘటిత రంగ కార్మికులు, కనీస వేతనాలకు నోచుకోని కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి రావాలని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నరసయ్య పిలుపునిచ్చారు.
శుక్రవారం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మహాసభల జయప్రదానికి శుభ సూచికంగా దుద్దెడ, వెలికట్ట, అంకిరెడ్డిపల్లి, కొండపాక, రవీంద్ర నగర్, గ్రామాలలో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం వెలికట్ట చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ నాల్గవ రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు.
అమ్ములు బాల నరసయ్య మాట్లాడుతూ ఎన్నికలలో అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రాబోయే రోజుల్లో పోరా టాలు ఉధృతం చేసేందుకు భవిష్యత్తు పోరాటాలను రూపకల్పన చేసుకునేందుకు ఈ మహాసభలు దోహదపడతాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాల ద్వారా సమ సమాజ స్థాపనక ఎర్రజెండా ముందుకు సాగుతుం దని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జగపతి నాగరాజు, మూడోజు కనకచారి, తాటోజు రవీంద్ర చారి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.