calender_icon.png 27 February, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ళు ఇవ్వలేకపోయారు.. పరిహారమైనా ఇప్పిస్తారా ’ఉత్తమ్ ’..

27-02-2025 01:20:09 AM

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది డిమాండ్

 పెన్పహాడ్, ఫిబ్రవరి 26: అప్పులు తెచ్చి ఆరుకాలం కష్టపడి వరి సాగు చేస్తే నెలలో పంట చేతికి వస్తుందని ఆశతో రైతు ఉంటే.. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వమని ఎండుతున్న పొలాలు, పశువులకు మేతగా మారిన వరి పోలాలను చూసి బోరున విలపించిన రైతుల బాధలు పేపర్లలో, టీవీ లలో వస్తున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కుతుత్తి మాటలు చెప్పారు తప్ప నీళ్లు ఇవ్వలేకపోయారని.. రైతుల దీనస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కనీసం రూ.30వేలు పరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 

బుధవారం మండల పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ ఆయకట్టు కింద ఉన్న చిన్నగారకుంటతండాలో రైతు జేఏసీ నాయకులు , సిపిఎం బృందంతో కలసి ఎండిపోయిన వారి పొలాలను పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు.  యాసంగి పంటకు చివరి ఆయకట్టు వరకు ఒక్క ఎకరా బీడు లేకుండా గోదావరి జలాలు అందించి   ఆదుకుంటామని ప్రభుత్వం  ముందుగానే రైతుకు భరోసా కల్పించడంతో ఆయకట్టు రైతులందరూ ఆశతో పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి వరి సాగు చేశారన్నారు.

తీరా పంట చేతికి వచ్చే సమయానికి అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆయకట్టు కింద సాగు చేసినా  నీళ్ళరాకపోవడంతో ప్రతి ఎకరా ఎండిపోయి పచ్చని పొలాలు పశువులకు మేతగా మారాయి అన్నారు. ఈవిషయంపై నీటి పారుగాంత విషయంలో రైతులు పడుతున్న బాధలు, అధికారుల నిర్లక్ష్యంపై మీడియా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నా జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా రైతులపై పట్టింపులేదన్నారు. ఉత్తమ్ ఉత్తుత్తి మాటలతో కాలం వెల్లదీసారు. ఉత్తమ్ సార్ తమరు నీళ్ళు ఇవ్వలేకపోయారు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కనీసం పెట్టుబడిమందం అయినా రూ.30వేలు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమములో సీపీఎం మండల కార్యదర్శి గుంజా వెంకటేశ్వర్లు, రైతు జేఏసీ నాయకులు, బాధిత రైతులు ఉన్నారు.